మాట్లాడితే హీరో సాయిధరమ్ తేజ్.. వేరే మెగా హీరోల కోసం ఏమీ వదిలిపెట్టకుండా అన్నీ వాడేసుకుంటున్నాడనే ఒక వాదన ఉంది. అదేనండీ.. పాటల రీమిక్సులూ.. సినిమా టైటిళ్ళూ.. మెగాస్టార్ కు సంబంధించిన చాలా పాటలు పేర్లు వాడేసుకుంటున్నాడు. తాజాగా వస్తున్న ''సుప్రీమ్'' కూడా అదే బాపత్తు. అయితే ఈ సినిమా కోసం టైటిల్ మ్యాటర్ పక్కనుంచితే.. అసలు రీమిక్స్ కూడా ఎందుకు చేసినట్లు అంటే.. దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం ఆ బాధ్యత నాదే అంటున్నాడు.
''నిజానికి రీమిక్స్ అనేది సాయిదరమ్ ఏమీ సజెస్టు చేయలేదు. నా మొదటి సినిమా పటాస్ లో కూడా ఒక రీమిక్స్ పాట ఉంది. అందుకే ఆ సెంటిమెంటుతో ఈ సినిమాలో కూడా ఒక రీమిక్స్ ఉంటే బాగుండని నేనే ఈ సాంగును మిక్స్ చేద్దాం అని అడిగి అందరినీ ఒప్పించా. చాలా ఖర్చు పెట్టించి దిల్ రాజు గారితో ఈ పాటను తీయించి. ఔట్ పుట్ అదిరింది'' అంటూ 'అందం హిందోళం' తాలూకు ఆ రీమిక్స్ భారాన్ని తన నెత్తిన వేసుకున్నాడు అనిల్ రావిపూడి.
సో.. ఈ రీమిక్స్ సాంగు గురించి అనవసరంగా సాయిధరమ్‌ను అపార్ధం చేసుకోకండి బాబులూ.