ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావిపూడి. పటాస్ సినిమా మొదలుకొని సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, లతో పాటు ఈ ఏడాది సంక్రాంతి బరిలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అటు మాస్.. ఇటు క్లాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా అనిల్ రావిపూడి సినిమాలు నచ్చుతున్నాయి. తన ప్రతి సినిమాలో కామెడీ ప్రధానంగా తెరకెక్కిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న అనిల్. ఇటీవలే మరో సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసాడట. గతేడాది విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లను హీరోలుగా.. తమన్నా, మెహరీన్ లను హీరోయిన్లుగా పెట్టి రూపొందించిన చిత్రం 'ఎఫ్2'. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని అప్పుడే ప్రకటించాడు.
ప్రస్తుతం కరోనా మూలంగా ఇంటి దగ్గరే ఉండి తన రైటింగ్ టీమ్ తో కలిసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. అయితే తను ప్రస్తుతం అనిల్ రెడీ చేసిన స్క్రిప్ట్ 'ఎఫ్3' మూవీదేనట. తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ సినిమాకు సీక్వెల్ తీసినా సరిగ్గా ఆడవు అనేది ఆనవాయితీగా నిరూపిస్తున్నారు ప్రేక్షకులు. మరి 'ఎఫ్3' మీద కూడా సినీ ఇండస్ట్రీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఎఫ్3 హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏ సినిమా షూటింగ్ కూడా చేయకూడదని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నారప్ప కూడా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాతే కంప్లీట్ అవుతుందని అన్నారు. అలాగే డైరెక్టర్ అనిల్ కూడా కరోనా తగ్గేవరకూ షూటింగ్ చేయకూడదని అనుకుంటున్నట్లు సమాచారం. ఓ వైపు ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే!