F2 డైరెక్టర్ కి మంచి హైక్ వచ్చిందట!

Update: 2019-03-16 11:33 GMT
ఫిలిం ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్నప్పుడే ఎవరికైనా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు.  డిమాండ్ ఉండాలంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండాలి.  దర్శకుడు అనిల్ రావిపూడికి ఇప్పుడు అలాంటి డిమాండే ఉంది. దీంతో అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ విషయం చర్చకొస్తోంది.  'పటాస్'.. 'సుప్రీమ్'.. 'రాజా ది గ్రేట్'.. 'F2'  సినిమాలతో హిట్స్ సాధించి తన సత్తా చాటాడు అనిల్.  దీంతో ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది.

ఈ సినిమాను దిల్ రాజు.. అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ రూ. 8 కోట్లు ఇస్తున్నారని సమాచారం.  స్టార్ డైరెక్టర్లకు ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తక్కువే కానీ అనిల్ కు తక్కువేమీ కాదు.  దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన 'F2' కు గానూ అనిల్ అందుకున్న రెమ్యూనరేషన్ రూ. 4 కోట్లని టాక్.  ఆ  లెక్కన ఇప్పుడు రెమ్యూనరేషన్ డబల్ అయినట్టే. అంతకంటే ఎక్కువగా మహేష్ లాంటి సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం కూడా అనిల్ కు తన కెరీర్ లో ప్లస్ అయ్యే అవకాశం ఉంది.  'F2' ను మలిచినట్టుగా మహేష్ సినిమాను బ్లాక్ బస్టర్ గా మలిస్తే ఫ్యూచర్లో అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ మరింతగా పెరగడం ఖాయమే.  
 
అనిల్ ప్రస్తుతం తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ ను పకడ్బందీగా తీర్చిదిద్దే  పనిలో బిజీగా ఉన్నాడట.  స్క్రిప్ట్ వర్క్ కొలిక్కిరాగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయని సమాచారం.  జూన్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారట. 
Tags:    

Similar News