సూపర్ స్టార్ మహేష్ కెరీర్ 25వ సినిమా `మహర్షి` మే 9న రిలీజవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ పూర్తవ్వగానే మహేష్ తన కెరీర్ 26వ సినిమాపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఎంబీ 26 చిత్రానికి ఎఫ్ 2 ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
తాజాగా మహేష్ - అనీల్ రావిపూడి సినిమాని `మహర్షి` వేదిక సాక్షిగా మరోసారి అధికారికంగా ఖాయం చేశారు. వేదికపై అతిధిగా విచ్చేసిన అనీల్ రావిపూడి మాట్లాడుతూ-``వంశీ పైడిపల్లి తో కలిసి `ఊపిరి` సినిమాకి ఫస్ట్ డ్రాఫ్ట్ కి పని చేశాను. గోవాలో పది రోజుల పాటు స్క్రిప్టు పని చేశాం. వంశీ గారి డెడికేషన్ ఎలాంటిదో నాకు తెలుసు. పొద్దున్నే స్క్రిప్టు పనిలో కూచుకుంటే.. 8 గంటలు ఆ పనిలోనే ఉంటారాయన. మహర్షి కోసం ఎంతో శ్రమించారు. పెద్ద విజయం సాధించాలి. మహర్షి అందరికీ కెరీర్ ల్యాండ్ మార్క్ సినిమా కావాలి`` అని అన్నారు.
తదుపరి తాను చేయబోయే సినిమా గురించి అనీల్ రావిపూడి ప్రస్థావిస్తూ.. నా నెక్ట్స్ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి అని అన్నారు. సూపర్ స్టార్ మహేష్ గురించి చెప్పాలంటే.. నేను క్లోజ్ గా అసోసియేట్ అయిన ఐదారు సినిమాల్లో ఆయన వ్యక్తిత్వంతోనే గొప్ప సూపర్ స్టార్ అని నిరూపించారు. తనతో ఉన్నంత సేపూ నవ్వుతూనే ఉంటాం. అంత సౌకర్యంగా ఉంటుంది. మీతో పని చేయడానికి ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నాను.. గొప్ప ఆఫర్ ఇచ్చారు.. కెరీర్ లో మర్చిపోలేను..అని అన్నారు. మొత్తానికి మహేష్ 26వ సినిమా గురించి అధికారికంగా దర్శకుడు అనీల్ రావిపూడి ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని రివీల్ చేయనున్నామని తెలిపారు. ఈ వేదికపై మహర్షి ట్రైలర్ ను ఆవిష్కరించిన విక్టరీ వెంకటేష్ ని ఉద్ధేశించి మాట్లాడుతూ.. వెంకీతో ఎఫ్ 2 చేశాను.. నా కెరీర్ లో బెస్ట్ చిత్రమిది అని అన్నారు.