అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తేనే బాక్సాఫీస్ నిండుకుండలా కళకళలాడుతుంది. కడుపుబ్బా నవ్విస్తూనే సెంటిమెంట్ డ్రామా యాక్షన్ వగైరా వగైరా ఎంటర్ టైన్ చేయాలి. అప్పుడు ఆ సినిమాకి బంపర్ కలెక్షన్స్ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పక్కా కామెడీ ఎంటర్ టైనర్లతో అగ్రదర్శకుల జాబితాలో చేరారు అనీల్ రావిపూడి.
జంధ్యాల-ఈవీవీ తర్వాత మళ్లీ అంతటివాడేనన్న ప్రశంసలు దక్కించుకున్నాడు. తెరకెక్కించిన తొలి సినిమా పటాస్ తోనే రావిపూడి సత్తా చాటారు. ఆ తర్వాతా అపజయమెరుగని దర్శకుడిగా వరుసగా విజయాలు అందుకుంటూనే రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. పటాస్ నుండి తన చివరి చిత్రం సరిలేరు నీకేవ్వరు వరకు కామెడీపై గ్రిప్ చెడకుండా తెరకెక్కించి విజయాలు అందుకున్నారు. 2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 కడుపుబ్బా నవ్వించడం వల్లనే అంత పెద్ద సక్సెసైంది. ఈ మూవీలో వరుణ్ వెంకీ కాంబో హాస్యానికి చాలా సానుకూల స్పందనలు వచ్చాయి.
ప్రస్తుతం ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నారు రావిపూడి. సీక్వెల్ కాని కథతో ఈ నెలలో సెట్స్ కెళ్లనున్నారు. అతని అన్ని సినిమాల మాదిరిగా కాకుండా అనిల్ రవిపుడి ఇప్పుడు సినిమా ఆద్యంతం కుటుంబ భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారట. F2 అంటే ఫన్ .. నిరాశ. ఈసారి మరో ఎఫ్ జోడించారు కాబట్టి అది `కుటుంబం`(ఫ్యామిలీ) అని తెలిసింది.
నిజానికి ఎఫ్ 3 కూడా ఎఫ్ 2 తరహా అని భావిస్తే తప్పులో కాలేసినట్టేనని తెలుస్తోంది. ఈసారి పక్కాగా అనీల్ దీనికి కొన్ని కుటుంబ భావోద్వేగాలను జోడించి స్క్రిప్ట్ రాశారు. చాలా సెంటిమెంట్ ఎలివేట్ చూస్తూనే మానవ సంబంధాల కోణం ఉంటుందని తెలుస్తోంది. సరదాగా నవ్విస్తూనే ఉద్వేగాలతో రగిలిస్తాడట. సరదాకి సెంటిమెంట్ కి మధ్య సమతుల్యతను సాధించాలనుకున్నారట.
వెంకీ -వరుణ్ జోడీతో పాటు చేరే మరొకరు ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. తమన్నా భాటియా.. మెహ్రీన్ కౌర్ లతో పాటు మరో నాయిక యాడవుతుందా లేదా చూడాలి. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.