సంక్రాంతి అల్లుళ్లుగా పేర్కొనబడిన 'ఎఫ్ 3'.. పలు వాయిదాల తర్వాత సమ్మర్ సోగ్గాళ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. విక్టరీ వెంకటేష్ - మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ఇది. 'ఎఫ్ 2' ఫన్ ఫ్రాంచైజీలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరినీ ఆకట్టుకున్న 'ఎఫ్ 3' పై మొదటి నుంచీ మంచి అంచనాలే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అల్టిమేట్ ఫన్ రైడ్ గా చెబుతూ వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్.. ప్రపంచ వ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదలైంది.
దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పినట్లుగానే అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిలింగా 'ఎఫ్ 3' ని తీర్చిదిద్దారు. సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి శుభం కార్డు పడే వరకూ నవ్వించడమే పరమావధిగా పెట్టుకున్నారు. కథ - లాజిక్స్ ని పక్కన పట్టించుకోకుండా చూస్తే ఇది కచ్చితంగా ఫ్యామిలీ అంతా నవ్వుకునే సినిమా అని చెప్పాలి.
రేచీకటి బాధితుడిగా వెంకటేష్ తనదైన శైలి కామెడీ టైమింగ్ తో అదరగొట్టగా.. నత్తితో ఇబ్బంది పడే పాత్రలో వరుణ్ తేజ్ మెప్పించారు. తమన్నా - మెహరీన్ - సోనాల్ చౌహన్ - సునీల్ - అలీ తదితరులు తమ పాత్రలతో వీలైనంత వరకు నవ్వించారు.
ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి టాలీవుడ్ టాప్ హీరోలందరినీ వాడుకొని.. అందరు హీరోల అభిమానులను ఆకట్టుకునే అనేక అంశాలను 'ఎఫ్ 3' సినిమాలో జోడించారు. ప్రభాస్ - మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ - జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల రెఫరెన్స్ లను ఇందులో పొందుపరిచారు.
థియేటర్లలో మిస్సయిన 'నారప్ప' గెటప్ లో వెంకీ ని చూపించి దగ్గుబాటి ఫ్యాన్స్ ని ఫిదా చేసాడు. అలానే బాబాయ్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' గెటప్ లో అబ్బాయ్ వరుణ్ తేజ్ ని చూపించి పవర్ స్టార్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించాడు.
'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి మహేష్ బాబు.. 'బాహుబలి' నుండి ప్రభాస్.. 'పుష్ప' నుండి అల్లు అర్జున్.. 'అరవింద సమేత' నుండి ఎన్టీఆర్.. 'రంగస్థలం' & 'RRR' నుండి రామ్ చరణ్ లను 'ఎఫ్ 3' సినిమాలోకి తీసుకొచ్చారు దర్శకుడు అనిల్. ఈ ఎపిసోడ్ ను ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.
అనిల్ రావిపూడి సినిమాలకు ఓ వర్గం ఫ్యాన్స్ ఎప్పుడూ నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇప్పటి వరకు అలాంటి చిత్రాలతోనే వరుస విజయాలు అందుకున్నారు. ఇప్పుడు 'ఎఫ్ 3' సినిమా విషయంలోనూ కొందరు డిజప్పాయింట్ అయినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ సమ్మర్ లో మెజారిటీ వర్గాలను ఈ సినిమా అలరిస్తోంది. దీనిని బట్టి అనిల్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ చేరిందని అనుకోవచ్చేమో!