కారణం ఏదైనా కూడా కానివ్వండి.. ఇప్పుడు హీరో రామ్ అండ్ డ్యాషింగ్ యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి కలసి వర్కు చేయట్లేదనే తెలుస్తోంది. ముఖ్యంగా తాము తీద్దాం అనుకున్న సినిమాను రామ్ తన సొంత బ్యానర్లో చేయాలని ఆశించడం.. కాని అనిల్ మాత్రం దిల్ రాజు కాంపౌండ్ వైపే మొగ్గు చూపడంతో.. ఈ సినిమా మెటీరియలైజ్ అయ్యేలా కనిపించట్లేదు. ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయిందని కూడా అందరూ చెప్పేసుకుంటున్నారు.
ఇక అసలైన ట్విస్టు ఏంటంటే.. ఈ కథను జూ.ఎన్టీఆర్ కు చెప్పాలని యోచిస్తున్నాడట దిల్ రాజు. ఇప్పటికే ఎన్టీఆర్ తో చాలా మంది రాపోర్టు ఉంది కాబట్టి.. అలాగే అనిల్ కూడా బ్రదర్ కళ్యాణ్ రామ్ తో పనిచేయడమే కాకుండా అతనికి పెద్ద హిట్టును తొలిసారిగా అందించాడు కాబట్టి .. ఎన్టీఆర్ కూడా అనిల్ తో పనిచేయడానికి రెడీగానే ఉన్నాడట. కాని ఇక్కడ విషయం చెప్పాలంటే.. ఇప్పుడు అనిల్ రావిపూడి చెబుతున్న కథలో హీరో ఒక గుడ్డి వాడు. రామ్ ఒప్పుకున్నాడంటే మనం ప్రయోగం అనుకుంటాం కాని.. ఇదే పాత్రను ఎన్టీఆర్ ఒప్పుకున్నాడంటే మాత్రం ఖచ్చితంగా దానిని సాహసం అనే చెప్పాలి.
యంగ్ టైగర్ కు ఉన్న స్టార్ ఇమేజ్ దృష్ట్యా అసలు ఈ పాత్రను చేస్తాడా చేయడా అనే విషయమే ఇప్పుడు ప్రేక్షకులకు తెలియాల్సి ఉంది. మరి యంగ్ టైగర్ ఏమంటాడో? చేస్తాడా.. చేయడా.. లెటజ్ సీ.