ఆ సినిమా రీమేకే.. కానీ రీమేక్ కాదు

Update: 2017-05-29 09:36 GMT
‘కేశవ’తో మరో హిట్టు కొట్టిన యువ కథానాయకుడు నిఖిల్.. దీని తర్వాత మూడు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. అందులో ఒకటి ‘కార్తకేయ’ సీక్వెల్ కాగా.. మిగతావి రెండు రీమేక్ సినిమాలు కావడం విశేషం. తమిళంలో హిట్టయిన ‘కణిదన్’తో పాటుగా కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ‘కిరిక్ పార్టీ’ రీమేక్ లోనూ నటించబోతున్నాడు నిఖిల్. వీటిలో ముందు మొదలయ్యేది ‘కిరిక్ పార్టీ’ రీమేకే. ఐతే ఇది పేరుకే రీమేక్ కానీ.. రీమేక్ లాగా ఉండదంటున్నాడు నిర్మాత అనిల్ సుంకర. దాన్ని అలా మార్చిన ఘనత చందూ మొండేటిదేనట. నిఖిల్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన చందూ.. అతడికి ‘కార్తికేయ’ లాంటి మంచి హిట్ ఇవ్వడమే కాదు.. ఆపై ‘సూర్య వెర్సస్ సూర్య’కు కూడా మాటల సాయం చేశాడు.

ఇప్పుడు చందూ.. ‘కిరిక్ పార్టీ’ని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చే బాధ్యత తీసుకున్నాడట. ఒరిజినల్ వెర్షన్ లైన్ మాత్రమే తీసుకుని.. దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చి స్క్రిప్టు రెడీ చేశాడని.. అది చాలా బాగా వచ్చిందని తెలిపాడు అనిల్ సుంకర. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ మీద రాజు సుందరం డైరెక్షన్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు అనిల్ తెలిపాడు. జూన్లోనే ‘కిరిక్ పార్టీ’ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ సినిమా పూర్తి చేశాక ‘కణిదన్’ రీమేక్ మీద దృష్టిపెడతాడు నిఖిల్. ఈలోపు చందూ.. నాగచైతన్యతో సినిమా చేసే అవకాశముంది. ఆ తర్వాత చందూ-నిఖిల్ కాంబినేషన్లో ‘కార్తికేయ-2’ సెట్స్ మీదికి వెళ్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News