దసరా అంటే పెద్ద పండుగ. తెలుగు ప్రజలకు చాలా సెంటిమెంట్. ఇంటింటా పండుగ చేసుకునే రోజుని.. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా మార్చేసింది. అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ.. ప్రపంచం దృష్టిని ఆకర్షించారు చంద్రబాబు. అదే సమయంలో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుండడంతో.. ప్రపంచం దృష్టి కూడా అమరావతిపై ఉంది. ఇలాంటి సమయంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అమరావతి పేరుతో సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి హిస్టారిక్ సినిమాలంటే ఓ భయం మనోళ్లకి.
కానీ అలాంటివాటిని తుడిచేసింది రుద్రమదేవి. ఓ ధీర వనిత వీరత్వాన్ని చూపిస్తేనే.. జనాలు నీరాజనాలు పడితే.. ప్రజలందరికీ సెంటిమెంట్ గా మారిపోయిన అమరావతి చరిత్రకు ఆదరణ ఖచ్చితంగా లభించే అవకాశాలున్నాయి. తెలుగు ప్రజలకు ఆది రాజధాని అమరావతే. ఇక్కడ హిందువులు - బౌద్ధులు - జైన మతాలు వర్ధిల్లిన చరిత్ర ఉంది. అనేక మంది రాజులు ఈ ప్రాంతాన్నే కేపిటల్ గా చేసుకుని పరిపాలించారు. అయితే.. రుద్రమదేవి విషయంలో ఒక కాలానికి సంబంధించిన చరిత్రమాత్రమే. కానీ అనేక శతాబ్దాల చరిత్రను ఎలా తెరెక్కిస్తారనే విషయం ఆసక్తి మారింది.
దూకుడు - ఆగడు - జేమ్స్ బాండ్ వంటి చిత్రాలు నిర్మించిన అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటీనటులు - టెక్నికల్ టీంతోపాటు.. మూవీపై అధికారిక ప్రకటన త్వరలోనే చేసే అవకాశముంది.