‘బాహుబలి’ బాటలోనే ‘రోబో-2’ కూడా..

Update: 2017-06-15 09:38 GMT
బాహుబలి హిందీ వెర్షన్ అనగానే అందరికీ కరణ్ జోహారే గుర్తుకొస్తాడు. ఈ సినిమాపై హిందీ ప్రేక్షకులు ముందుగా ఆసక్తి చూపించడానికి ముఖ్య కారణాల్లో కరణ్ ఒకడనడంలో సందేహం లేదు. ఐతే ‘బాహుబలి’ రెండు భాగాల్ని పక్కా ప్రణాళిక ప్రకారం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి కారణమైన వ్యక్తి గురించి మాత్రం చాలామందికి తెలియదు. ఆ వ్యక్తి పేరు.. అనిల్ తడాని. అతను దేశంలోనే పేరుమోసిన డిస్ట్రిబ్యూటర్. అనిల్ సంస్థ ‘ఏఏ ఫిలిమ్స్’ ద్వారానే ‘బాహుబలి’ రెండు భాగాల హిందీ వెర్షన్లూ దేశవ్యాప్తంగా విడుదలయ్యాయి. రాజమౌళి సైతం అనిల్ గురించి కొన్ని ఇంటర్వ్యూల్లో గొప్పగా మాట్లాడాడు.

ఇప్పుడీ అనిల్ సహకారంతోనే శంకర్-రజినీకాంత్ ల మెగా మూవీ ‘2.0’ హిందీ వెర్షన్ కూడా విడుదల కాబోతోంది. ‘ఏఏ ఫిలిమ్స్’ భాగస్వామ్యంతో తమ లైకా ప్రొడక్షన్సే ‘2.0’ హిందీ వెర్షన్ ను రిలీజ్ చేస్తోందని ఈ చిత్ర నిర్మాత రాజు మహాలింగం ప్రకటించాడు. 2.0 హిందీ వెర్షన్ హక్కుల్ని రూ.80 కోట్లకు గుంపగుత్తగా కట్టబెట్టేశారని వార్తలు వస్తున్న సమయంలోనే రాజు మహాలింగం ఈ ప్రకటన చేయడం విశేషం. ‘2.0’ అంచనాలకు తగ్గట్లుగా ఉండి.. దాన్ని సరిగ్గా ప్రమోట్ చేస్తే ‘బాహుబలి-2’కు దీటుగా వసూళ్లు సాధించే అవకాశముందని.. రూ.80 కోట్లకు హిందీ హక్కులు అమ్మేయడం తెలివి తక్కువ ఆలోచన అని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా.. ‘2.0’ డీల్ ఫైనలైజ్ కాలేదని.. పూర్తిగా హక్కులు ఇచ్చేయకుండా ఉభయతారకంగా ఉండే డీల్ ద్వారా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా సంకేతాలిచ్చాడు నిర్మాత.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News