మొన్నటి వరదలతో అల్లకల్లోలమైపోయిన చెన్నైని ఆదుకోవడంలో సినీ తారలు చాలానే చొరవ చూపారు. మన రాష్ట్రం కాకపోయినప్పటికీ తెలుగు సినీ తారలంతా కలిసికట్టుగా ముందుకొచ్చి ‘మన మద్రాస్ కోసం’ అంటూ చైతన్య స్ఫూర్తి రగిలిస్తూ చెన్నైకి పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. డబ్బు - వస్తు రూపేణా సాయపడుతున్నారు. మరోవైపు తమిళ సినీ పరిశ్రమ కూడా చెన్నైకి అండగా నిలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ పది కోట్లిచ్చినట్లు వార్తలొస్తుండగా.. విజయ్ రూ.5 కోట్ల సాయం ప్రకటించాడు. మిగిలిన సినీ తారలు కూడా భారీగానే విరాళాలిచ్చారు.
ఐతే సంగీత దర్శకుల నుంచి విరాళాల విషయంలో తొలి అడుగు కొలవెరి కుర్రాడు అనిరుధ్ వేయడం విశేషం. అతను ఏకంగా రూ.50 లక్షల విరాళంతో అందరికీ షాకిచ్చాడు. 24 ఏళ్ల ఈ కుర్రాడు.. పట్టుమని పది సినిమాలు చేసి ఉండడు. మొత్తంగా ఎంత సంపాదించాడో కానీ.. అతడి స్థాయికి రూ.50 లక్షల సాయం చేయడమంటే చిన్న విషయం కాదు. అందుకే ధనుష్ ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ని ఉద్దేశించి.. ‘‘చిన్న పిల్లోడు.. కానీ పెద్ద మనసు’’ అని కితాబిచ్చాడు. అనిరుధ్ భారీ విరాళం ప్రకటించడంతో ఇక మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు సైతం డొనేషన్లతో ముందుకు రాక తప్పని పరిస్థితి నెలకొంది. కాగా లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ చెన్నై కోసం ఓ మ్యూజికల్ షో చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.