వై దిస్ కొలవెరి పాటతో వరల్డ్ ఫేమస్ అయ్యాడు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా రేసులో దూసుకుపోయాడు. క్షణం తీరిక లేని ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అంతేనా తొలి సినిమాతోనే శ్రుతిహాసన్‌తో ఎఫైర్ నడిపించిన కుర్ర మ్యూజిక్ డైరెక్టర్‌గా మరింత పాపులర్ అయ్యాడు.
కేజీ కండయినా లేని.. చూడటానికి గెడకర్రలా బక్కపలచగా కనిపించినా అన్ని కోణాల్లోనూ అనిరుధ్ ట్యాలెంటెడ్ అని కోలీవుడ్‌లో ముచ్చటించుకున్నారు. అమ్మాయిలతో చాటింగులు, డేటింగుల్లో స్పీడ్‌గా ఉంటాడన్న పేరొచ్చింది. ఆ మధ్యన సింగర్ ఆండ్రియా జెరీమియాతో డేటింగ్ చేశాడులే. ప్రస్తుతం అనిరుధ్ హీరో అవుతున్నాడు. ఆక్కో అనేది టైటిల్. ఈ చిత్రంలో ఓ స్పెషల్ ఐటెమ్ నంబర్ ఉంది. ఇందులో లండన్ బ్యూటీ ఎమీజాక్సన్ ఆడి పాడనుంది. ఎమీతో పాటుగా అనిరుధ్ స్టెప్పులు కలుపుతాడని సాంబార్ ట్యాండ్ నుండి టాక్ వస్తోంది.
ఎనక్కెన్న యారుమ్ ఇళయె అంటూ సాగే ఈ పాటకి సంగీతం కూడా తనే అందిస్తున్నాడు. వచ్చే నెలలో అమెరికాలో షూటింగ్ చేయనున్నారు. ఇప్పటికే ఎమీజాక్సన్‌తో గురుడు చాలా స్పీడ్‌గా కలిసిపోయాడట. మొత్తానికి అనిరుధ్ మాటేమో గాని ఎమీ మాత్రం తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది.