అంజ‌లి పెద్ద షాకే ఇచ్చిందిగా..

Update: 2017-03-11 17:11 GMT
ఏడాది ముందు నుంచి వాయిదాల మీద వాయిదాలు ప‌డుతున్న ‘చిత్రాంగ‌ద’ సినిమా ఎట్ట‌కేల‌కు విడుద‌లైంది. ఐతే సినిమా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేక‌పోయింది. తెలుగులో చాన్నాళ్ల త‌ర్వాత విడుదైల‌న అంజ‌లి సినిమా ఇది. కానీ దీని వ‌ల్ల ఆమెకు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఏమీ క‌లిగేట్లు లేదు. ఐతే సినిమా ఎలా ఉన్నా అంజ‌లి పెర్ఫామెన్స్ విష‌యంలో మాత్రం ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. సినిమా కోసం త‌న వంతుగా బాగానే క‌ష్ట‌ప‌డింది అంజ‌లి. ఇందులో అంజ‌లి పాత్ర ఆమె అభిమానుల‌కు పెద్ద షాకే.

‘చిత్రాంగ‌ద‌’లో అంజ‌లి లెస్బియ‌న్ త‌ర‌హా పాత్ర పోషించ‌డం విశేషం. ఆమెను ఒక మ‌గ ద‌య్యం ఆవ‌హిస్తుంది. ఆ ద‌య్యం పూర్వ జ‌న్మ‌లో స్త్రీ లోలుడు. అంజ‌లికి ద‌య్యం ప‌ట్టాక ఆమె కూడా అమ్మాయిల మీద మోజు ప‌డుతుంది. వాళ్ల‌ను లైంగికంగా వేధిస్తుంది.  మ‌గాడిలా న‌డుస్తుంది. మేన‌రిజ‌మ్స్.. బాడీ లాంగ్వేజ్ కూడా చిత్రంగా ఉంటుంది. కాస్త పేరున్న హీరోయిన్లెవ్వ‌రూ కూడా ఇలాంటి పాత్ర చేయ‌డానికి ముందుకు రారు. ఇలాంటి క్యారెక్ట‌ర్లు చేస్తే ఇమేజ్ దెబ్బ తింటుంద‌ని భ‌య‌ప‌డ‌తారు. కానీ అంజ‌లి ధైర్యంగానే ఈ పాత్ర‌ను ఒప్పుకుంది. ఐతే ఆమె పెర్ఫామెన్స్ బాగుంద‌ని ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నా.. సినిమా అయితే నిల‌బ‌డే అవ‌కాశాలు కనిపించ‌ట్లేదు. ఈ చిత్రం అంజ‌లి కెరీర్ కు కూడా పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డేలా క‌నిపించ‌డం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News