తెలుగమ్మాయి అంజలి ఇటీవల తెలుగు తెరకు దూరమైంది. అడపాదడపా తమిళ అనువాద చిత్రాలతో ఇంతకుముందు సందడి చేసింది. ప్రస్తుతం అవీ లేవు. దీంతో తనని పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఈ భామ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న 'నిశ్శబ్ధం' లో ఠఫ్ కాప్ పాత్రలో కనిపించబోతోంది. అది కూడా అమెరికా సియోటెల్ బ్యాక్ డ్రాప్ పోలీస్ అధికారిగా కనిపించనుంది. పోలీస్ గెటప్ కి తగ్గట్టే షార్ట్ హెయిర్ కట్ తో బబ్లీగానూ కనిపిస్తోంది. తనో క్రైమ్ డిటెక్టివ్ ఏజెంట్ గా కనిపించబోతోంది ఈ చిత్రంలో. అలాగే తన పాత్ర పేరు 'మహ'.
తాజాగా రిలీజైన పోస్టర్ లో అంజలి ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది. అమెరికన్ పోలీస్ డ్రెస్ లో దర్శనమిచ్చిన అంజలి నడుముకు ఉన్న పౌచ్ లో గన్ ని ఫిక్స్ చేస్తోంది. బ్లాక్ డార్క్ గ్లాసెస్ తో రెబల్ పోలీస్ లా కనిపిస్తోంది. నిశ్శబ్ధం టైటిల్ కి క్రైమ్ జోనర్ కి లింక్ ఏమిటన్నది నిర్మాత కం రచయిత కోన వెంకట్ నే చెప్పాల్సి ఉంటుంది. అంజలిని సియోటెల్ పోలీసాఫీసర్ గా బరిలో దించడం వెనక సెలెక్షన్ కోనదేనని భావించవచ్చు. అతడు నిర్మించిన గీతాంజలి చిత్రంలోనూ అంజలి కథానాయిక.
ఇక ఈ చిత్రంలో అనుష్క ఎలాంటి పాత్రలో నటిస్తోంది? అంటే.. తనో క్లాసిక్ డ్యాన్సర్ అని తన పాత్ర మూగ బధిరురాలు అని చెబుతున్నారు. ఇందులో ఆర్.మాధవన్ .. షాలిని పాండే- సుబ్బరాజు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కేవలం తెలుగులోనూ కాదు .. భాషతో సంబంధం లేకుండా యూనివర్శల్ గా పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. కోన ఫిలింకార్పొరేషన్ - పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు.