షారుఖ్ ‘రాయీస్’ గుట్టు విప్పిన నటి

Update: 2016-10-31 11:26 GMT
పాకిస్థాన్ మార్కెట్ ను కొల్లగొట్టేద్దామని ఆ దేశ ఆర్టిస్టుల్ని తమ సినిమాల్లో పెట్టుకున్న బాలీవుడ్ నిర్మాతల పరిస్థితి దయనీయంగా ఉంది ప్రస్తుతం. సినిమాలు మొదలైనపుడు అంతా బాగుంది కానీ.. షూటింగ్ మధ్యలో ఉండగా పాక్ ఆర్టిస్టుల విషయంలో రాజకీయ వర్గాల నుంచి సామాన్యుల దాకా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాక్ ఆర్టిస్టులున్న సినిమాల్ని బ్యాన్ చేసేదాకా పరిస్థితి వచ్చింది. కరణ్ జోహార్ లాంటి వాడు పాక్ నటుడిని పెట్టుకున్నందుకు లెంపలేసుకుని.. ఇకపై అలా చేయను అంటే తప్ప ‘యే దిల్ హై ముష్కిల్’ రిలీజ్ కాలేదు. మరోవైపు అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ ‘రాయీస్’ సినిమాలో ఏకంగా హీరోయినే పాకిస్థానీ. ఈ సినిమా విషయంలోనూ వివాదం నెలకొనడంతో షూటింగ్ ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇలాంటి తరుణంలో ఆ సినిమా యూనిట్ వర్గాల్ని మరింత ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలతో మీడియా ముందుకొచ్చింది ఫెమీనా మాజీ మిస్ ఇండియా అంకితా షోరే. వాస్తవానికి ‘రాయీస్’ సినిమాకు ముందు హీరోయిన్ గా అనుకున్నది అంకతానేనట. ఆమెకు స్క్రీన్ టెస్టు కూడా చేసి ఓకే అన్నారట. ఆమె విషయంలో హీరో షారుఖ్ కూడా పాజిటివ్ గానే ఉన్నాడట. ఐతే దర్శకుడు.. నిర్మాత కలిసి ఈ డెసిషన్ మార్చేశారని.. పాకిస్థాన్ కు చెందిన ముస్లిం నటి అయితే.. అక్కడ మార్కెట్ బాగుంటుందని చెప్పి తనను పక్కనెబట్టి మహీరా ఖాన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని అంటోంది అంకితా. కేవలం ఇండియన్ అయినందువల్లే తనను తప్పించారంటూ తీరిగ్గా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తోంది అంకితా. మొత్తానికి సరైన టైమింగ్ చూసి ఈ కామెంట్లు చేయడం ద్వారా తనకు ఆశ కల్పించి నిరాశలో ముంచెత్తినందుకు బాగానే ప్రతీకారం తీర్చుకుంది అంకితా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News