తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన ఇంటిగ్రేటెడ్ మీడియా & ఎంటర్టైన్మెంట్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్. ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున సారధ్యంలో నిర్వహించబడుతుంది. ఓవైపు సినిమాలు నిర్మిస్తూ వర్ధమాన ఫిల్మ్ మేకర్స్ ను, ఔత్సాహిక నటీనటులకు అవకాశాలను కల్పిస్తోంది.
మరోవైపు ఫిల్మ్ స్టూడియో నిర్వహించడమే కాదు.. అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ని కూడా నడుపుతున్నారు. ఇది ఫిల్మ్ అండ్ మీడియా సంబంధిత సబ్జెక్ట్లలో ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాచిలర్స్ - మాస్టర్స్ మరియు ఎంబీఏ కోర్సులను అందుబాటులో ఉంచుతోంది. ప్రతి ఏడాదీ ఎంతోమంది ప్రతిభావంతులైన నటీనటులు - సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి అందిస్తోంది.
అయితే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వారు హైదరాబాద్ లో ఫుల్ సర్వీస్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఫిలిం మేకర్స్ మరియు కంటెంట్ క్రియేటర్స్ వారి విజన్ ను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదభరితమైన మరియు జ్ఞానోదయం చేసే లైఫ్ స్టోరీలను తీసుకొస్తుంది. దీని కోసం అన్నపూర్ణ వారు క్యూబ్ సినిమాస్ తో కలుస్తున్నారు.
క్యూబ్ సినిమా అనేది ఎండ్-టు-ఎండ్ డిజిటల్ సినిమా టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ లో అగ్రగామి సంస్థ. సినిమా బిజినెస్ లో దశాబ్దాల అనుభవంతో, ఫిలిం మేకర్స్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాల నుండి ఎగ్జిబిటర్లు, ప్రేక్షకుల వరకు డిజిటల్ ఎన్విరాన్మెంట్ అందిస్తుంది. ఇప్పుడు వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ తో కలుస్తోంది.
ఇది పాన్-ఇండియన్ మరియు అంతర్జాతీయ కంటెంట్ క్రియేటర్స్ కు భారతదేశపు ఫస్ట్ ఫుల్ సర్వీస్ LED ప్రొడక్షన్ స్టేజ్. 20 అడుగుల ఎత్తు - 60 అడుగుల వెడల్పు - 2.3 mm డాట్ పిచ్ కర్వులతో ఈ వర్చువల్ స్టేజ్ రూపొందనుంది. ఇందులో అల్ట్రా హై రిఫ్రెష్ రేట్ - వైడ్ కలర్ గ్యామట్ మరియు హై బ్రైట్ నెస్ LED స్క్రీన్ తో వరల్డ్ క్లాస్ పర్మనెంట్ స్టేజ్ ఏర్పాటు కానుంది. మన దేశంలో ఈ స్థాయి వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ఇదే మొదటిది కానుంది.
ఇది కంపోజిషన్ మరియు ఆన్-లొకేషన్ ప్రొడక్షన్ ఖర్చులను తగ్గించడం మరియు సమయాన్ని ఆదా చేయడంతో పాటు డబ్బును ఆదా చేయడానికి ఫిలిం మేకర్స్ కు సహాయపడుతుందని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మేకర్స్ వర్చువల్ ప్రొడక్షన్ పై ఆసక్తి కనబరుస్తున్నారు.
సృజనాత్మకత కలిగిన ఎందరో దర్శక నిర్మాతలు ఈ వర్చువల్ ప్రొడక్షన్ ద్వారా తమ ప్రాజెక్ట్స్ ను మరింత అందంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. దీని కోసం విదేశాలకు వెళ్లి వర్చువల్ గా తమ చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలను రూపొందించుకోవాల్సి వస్తోంది. అలాంటి వారికి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ & క్యూబ్ సినిమా సంయుక్తంగా తీసుకోస్తోన్న వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ఉపయోగపడుతుంది.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ''ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త సాంకేతికతను అందించడంలో ప్రసిద్ధి చెందిన క్యూబ్ తో భాగస్వామి అయినందుకు మేము గర్విస్తున్నాము. సినిమాలు రూపొందించడంలో మరియు స్టూడియోలను నడపడంలో మా బలం, అనుభవం ఇప్పుడు క్యూబ్ యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో కలవడం అనేది ఇది గొప్ప సహకారాన్ని అందిస్తుంది" అని అన్నారు.