పర్ఫెక్ట్ విలన్ గా మారిన ట్రైన్డ్ పైలట్

Update: 2017-02-15 06:07 GMT
హిందీ బుల్లితెరపై కేరక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు ఠాకూర్ అనూప్ సింగ్. రామాయణ్ లో చేసిన హనుమాన్ పాత్ర తర్వాత.. 2014లో మహాభారత్ లో చేసిన ధృతరాష్ట్రుడి పాత్ర.. ఇతడి కెరీర్ ని మలుపు తిప్పేసింది. అంధుడైన చక్రవర్తి పాత్రలో చాలా స్ట్రాంగ్ అనూప్ చూపిన పెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా కోలీవుడ్ హీరో సూర్య నటించిన సింగం3 లో కూడా విలన్ గా మెప్పించాడు ఠాకూర్ అనూప్ సింగ్.

'నేను కొత్త భాషలో డైలాగ్స్ చెప్పే వరకూ ఎంతసేపైనా ఎదురు చూసిన సూర్య లాంటి స్టార్ కు.. సింగం టీంకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ సినిమాకి డబ్బింగ్ కూడా నేనే చెపప్పుకున్నాను. 2016 నాకు చాలా బిజీగా గడిచింది. తమిళ్ లో ఎస్3 తో పాటు.. తెలుగులో సాయిధరంతేజ్ మూవీ విన్నర్.. హిందీలో కమాండో.. తెలుగు-కన్నడ బైలింగ్యువల్ రోగ్ లో కూడా నటించాను. ఇన్ని భాషల పరిశ్రమల చుట్టూ తిరగడంతో చాలానే నేర్చుకున్నాను' అని చెప్పాడు కొత్త విలన్.

'కొన్ని సీన్లలో ఎమోషన్స్ పలికించడానికి ఇబ్బంది పడేవాడిని. కొన్ని గంటలపాటు నా డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి మరీ యాక్టిం చేసేవాడిని. నేను చేసిన అన్ని సినిమాల్లోనూ హీరోకు పోటీగా స్ట్రాంగ్ గా ఉండేవే' అని చెప్పిన అనూప్ సింగ్.. నిజానికి ఒక ట్రైన్డ్ పైలట్. యాక్టింగ్ ని తన కెరీర్ గా ఎప్పుడూ భావించకపోయినా.. విధి తనకు ఇక్కడ స్ట్రాంగ్ కెరీర్ ఇచ్చిందని చెబుతున్నాడు విన్నర్ విలన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News