మియా మల్కొవాతో తీసిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ విడుదలైనప్పుడు ఎంత సంచలనం రేపిందో ఇప్పుడు వర్మ మెడకు చుట్టుకుంటున్న కేసుల ఉదంతం అంత కన్నా ఎక్కువ అనిపించేలా ఉంది. ఇప్పటికే ఉన్న కేసులతో పోరాడేందుకు వర్మ తన ఆయుధాలు సిద్ధం చేసుకునే పనిలో ఉండగా తాజాగా విశాఖపట్నం ఎంవిపి పోలీస్ స్టేషన్ లో కొత్త ఫిర్యాదు నమోదు అయ్యింది. చేసింది మహిళా సంఘాలే. వర్మ పోర్న్ కంటెంట్ ని ప్రోత్సహిస్తున్నాడని, అతని కామెంట్స్ మహిళలను కించపరిచేలా చాలా దారుణంగా ఉన్నాయని అందులో పేర్కొంటూ వర్మ జిఎస్టి గురించి అందులో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో వైజాగ్ లో వర్మకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష కొనసాగుతోంది.
ఈ నేపధ్యంలో ఇది మీడియాలో హై లైట్ అవ్వడంతో పాటు వర్మ మీద చర్యలు తీసుకునేలా ప్రభుత్వం మీద కూడా మహిళా సంఘాలు ఒత్తిడి మొదలు పెట్టడంతో హోం మినిస్టర్ చినరాజప్ప ఆదేశాల మేరకు వర్మ మీద కేసు రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది. కొన్ని టీవీ ఛానల్స్ ఇదే విషయమై నిర్వహిస్తున్న లైవ్ డిబేట్స్ లో సైతం అధికార పార్టీ ప్రతినిధులను నేరుగానే అడిగేస్తున్నారు మహిళలు. సన్నపనేని రాజకుమారి గారికి ఇది అనుభవమైంది. దీంతో వర్మపై కేసుల పరంపర ఇప్పట్లో ఆగేలా లేదు.
వర్మ చేసింది రైటా రాంగా అనే చర్చను పక్కన పెడితే ఇదే స్థాయి స్పందన - చర్యలు యువతను రుగ్మతలా కమ్ముకుని వారి మానసిక ప్రవర్తన మీద తీవ్ర ప్రభావం చూపుతున్న వాటిపై కూడా రావడం ఎంతైనా అవసరం. పోర్న్ కొత్తగా పుట్టుకువచ్చింది కాదు, ఇప్పుడు వర్మ మీద చర్యలు తీసుకుంటే ఆగిపోయేది కాదు. మూలాలు కనుక్కుని దాన్ని కట్టడి చేసే మార్గాల వైపు దృష్టి సారిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. ఒకరకంగా ఇప్పుడు జరుగుతున్నది వర్మకు ఒక అలెర్ట్ లాగా అనుకోవచ్చు. ఏదైనా తీయొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు అనే ధోరణికి ఇది చెక్ పెట్టేలాగే ఉంది. లేదు నేను మారను అని వర్మ మళ్ళి పాత స్టైల్ లోకి వస్తాడేమో చూడాలి.