కొన్ని సినిమాలు రకరకాల కారణాలతో రిలీజ్ ఆగిపోతుంటాయి. ఎక్కువగా బడ్జెట్ ఇష్యూలతోనే ఈ సమస్య వస్తుంది. రీసెంట్ గా గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ కు ఎదురైన సమస్యను గుర్తించచ్చు. బాహుబలి2 కూడా తమిళ్ రిలీజ్ మ్యాట్నీషోల నుంచే పడింది. కానీ అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడకు ఇలాంటి సమస్య వచ్చే అవకాశమే లేదు. బన్నీ మార్కెట్ అలాంటిది మరి. పైగా ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు కావడంతో.. డీజేకు బ్రేక్ పడడం అసాధ్యం అనుకోవడంలో ఆశ్చర్యం లేదు.
కానీ ఇక్కడ సమస్య వేరేలా ఉంది. గుడిలో బడిలో పాట గురించి బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పాటలోని పదాలను మార్చాలంటూ వారు చేసిన డిమాండ్లకు అంగీకరించిన డీజే టీం.. లిరిక్ ను ఛేంజ్ చేసి అందుకు తగ్గట్లుగానే సెన్సార్ తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు హీరో కేరక్టరైజేషన్ పై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బ తీసేలా ఉండే అవకాశం ఉందంటూ.. బ్రాహ్మణ సంఘాలు హైకోర్టులో మరో కేసు వేసినట్లు తెలుస్తోంది.
హైకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించడడంతో.. దువ్వాడ జగన్నాధం చెప్పిన డేట్ కే వస్తాడా లేదా అనే అనుమానాలు కొందరిలో తలెత్తున్నాయి. తెల్లారితే సినిమా రిలీజ్ అనగా.. కొత్త తలనొప్పి ఎదురయే పరిస్థితి కనిపిస్తుండడంతో.. మేకర్స్ కూడా కాసింత టెన్షన్ గానే ఉన్నారట.