బిగ్‌ బాస్‌ 3 లో మరో ఎమోషనల్‌ ఎపిసోడ్‌

Update: 2019-10-15 06:36 GMT
బిగ్‌ బాస్‌ తెలుగు మొదటి రెండు సీజన్‌ లలో చివరి వారాల్లో కంటెస్టెంట్స్‌ ఇంటి సభ్యులు రావడం జరిగింది. ఇంటి సభ్యులు వచ్చిన సమయంలో కంటెస్టెంట్స్‌ ఎమోషనల్‌ అవ్వడం.. ఆ తర్వాత ఆనందంతో ఎగిరి గంతేయడం వంటివి జరిగాయి. ఇక బిగ్‌ బాస్‌ మూడవ సీజన్‌ లో కూడా అలాంటి ఎమోషనల్‌ ఎపిసోడ్‌ నేడు రాబోతుంది. నేడు మరియు రేపటి ఎపిసోడ్స్‌ లో కంటెస్టెంట్స్‌ వద్దకు వారి వారి కుటుంబ సభ్యులను పంపించబోతున్నారు. నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమోలో ఫ్యామిలీ మెంబర్స్‌ ఎంటర్‌ అవ్వబోతున్నట్లుగా హింట్‌ ఇచ్చారు.

మొదటి రెండు సీజన్‌ లలో కూడా కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ ఎంటర్‌ అయిన ఎపిసోడ్స్‌ కు మంచి స్పందన వచ్చింది. ఫ్రీజ్‌.. రిలీజ్‌ అంటూ గత సీజన్‌ లో బిగ్‌ బాస్‌ వారితో ఆడుకుంటే ఈసారి మాత్రం స్లీప్‌ అంటూ వారితో కళ్లు మూయించి ఆ తర్వాత వాళ్లకు సంబంధించిన వారిని బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి ప్రవేశ పెడుతున్నారు. మొదటి రెండు సీజన్‌ లతో పోల్చితే ఈసారి ఈ ఎమోషనల్‌ ఎపిసోడ్స్‌ మరింత ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉందనిపిస్తుంది.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 క్లైమాక్స్‌ కు చేరింది. మరో రెండు లేదా మూడు వారాల్లో ఈ సీజన్‌ ముగియబోతుంది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు కంటెస్టెంట్స్‌ ఉన్నారు. ఈ వారం అంతా నామినేట్‌ అయ్యారు. అందరు నామినేషన్‌ లో ఉన్న ఇలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యుల రాకతో వారు కాస్త రిలాక్స్‌ అవ్వడంతో పాటు కాస్త బూస్టప్‌ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నేటి ఎపిసోడ్‌ లో ఎవరి కోసం ఎవరు వస్తారో చూడాలి.

Tags:    

Similar News