గత ఏడాది బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న 'మహానటి' చిత్రంతో కీర్తి సురేష్ తెలుగులో స్టార్ డంను దక్కించుకుంది. మహానటి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఎట్టకేలకు ఒక లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. నరేంద్ర దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా డానీ సంచేజ్ లోపేజ్ వర్క్ చేయబోతున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్ అయిన డానీని నాగ్ అశ్విన్ 'మహానటి' చిత్రం కోసం తీసుకు వచ్చిన విషయం తెల్సిందే.
మహానటి చిత్రంలోని విజువల్స్ అద్బుతంగా రావడంతో పాటు, కథానుసారంగా సినిమాటోగ్రఫీ ఉంది. మహానటి మంచి సక్సెస్ అవ్వడంలో సినిమాటోగ్రఫీ కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కీర్తి సురేష్ ను అచ్చు సావిత్రిలా దర్శకుడు చూపించడం కోసం డానీ ఇచ్చిన టెక్నికల్ సపోర్ట్ మరువలేనిది. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ అశ్విన్ ఒకానొక సందర్బంగా చెప్పుకొచ్చాడు.
తెలుగులో కీర్తి సురేష్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా అవ్వడం వల్ల ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను ఈనెల 10 నుండి ప్రారంభించబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు. కీర్తి సురేష్ ను మళ్లీ ప్రేక్షకులను అలరించేలా డానీ చూపిస్తాడేమో చూడాలి.