రియల్ హీరో సోనూ సూద్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మొదటి వేవ్ లో ఎంతో మందిని ఆదుకున్న సోనూ సూద్.. దేశంలో కొనసాగుతున్న కరోనావైరస్ సెకండ్ వేవ్ లోనూ వేలాది మందికి సహాయం చేస్తున్నారు.
దేశంలోని ఏ మూల ఏ వ్యక్తి సాయం కోరిన తన టీంతో కలిసి ఆదుకుంటున్నాడు. భారతదేశంలో ఎవరు సహాయం కోరితే సోను సూద్ తన వంతు కృషి చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా విస్తరించిన తన బృందాన్ని అలెర్ట్ చేస్తూ అందిరకీ సాయం చేస్తున్నాడు. సోనూ సేవా గుణంతో ఈ సంవత్సరం నిజమైన హీరో అయ్యాడు.
తాజాగా తెలుగువారికి మరో సాయం చేశాడు సోనూ సూద్. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో మృతదేహాల సంరక్షణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను ఇస్తున్నారు. ఇందులో సానికిరెడ్డి పల్లి, ఆషాపూర్, బోంకూర్, ఓర్వకల్, మడ్డికేరా మరియు ఇంకా చాలా గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో అనేక గ్రామ సర్పంచ్‌లు సహాయం కోసం సోనుసూద్ ను సంప్రదించారు. దీంతో సోనూ సూద్ ఈ గ్రామాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.వాటిని సమకూర్చారు.
ఇన్నాళ్లు ఈ గ్రామాల వారు సమీప నగరం నుండి ఫ్రీజర్ బాక్స్ రావడానికి ఇబ్బందులు పడ్డారు. దీనివల్ల శవాలు కుళ్లిపోయి అయిన వారి చివరి చూపుకు దూరమయ్యేవారు. ఇది చాలా అసౌకర్యాలకు కారణమైంది. .
సహాయం కోసం సోను సూద్ ను సంప్రదించడంతో ఈ ఎంపిక చేసిన గ్రామాలకు వీలైనంత త్వరగా బాక్సులను అందుబాటులో ఉంచుతామని సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు. వాటిని సమకూర్చారు.