దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో.!

Update: 2019-10-21 10:37 GMT
దగ్గుబాటి సురేష్ బాబు.. టాలీవుడ్ దిగ్గజ ప్రొడ్యూసర్ లలో ఒకరు. ఆయన కుమారుడు రానా అంతే పేరు తెచ్చుకున్నారు. కానీ రానా తమ్ముడు అభిరామ్ మాత్రం అప్పట్లో వివాదాల్లో చిక్కుకున్నారు. శ్రీరెడ్డి ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. దీంతో హీరో అవుదామని అనుకున్న అభిరామ్ చాలా కాలం దూరంగా ఉండిపోయారు.

శ్రీరెడ్డి వివాదాలతో సురేష్ బాబు తన కుమారుడు అభిరామ్ ను బెంగళూరు పంపి అక్కడి వ్యవహారాలు అప్పగించారని టాక్ నడిచింది.

అయితే శ్రీరెడ్డి వివాదానికి ముందే సురేష్ బాబు తన రెండో కుమారుడు అభిరామ్ ను టాలీవుడ్ కు పరిచయం చేయడానికి వచ్చిన ప్రతిపాదనను అంగీకరించలేదట.. నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాత్రం ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కాగా ప్రస్తుతం అభిరామ్ ముంబైలోని లీడింగ్ యాక్టింగ్ ట్రైనర్ వద్ద నటనలో శిక్షణ పొందుతున్నట్టు తెలిసింది. సరైన లాంచింగ్ కోసం ఈ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక సురేష్ బాబు కూడా తన రెండో కొడుకును ఘనంగా లాంచ్ చేయడానికి సరైన కథ కథనం కోసం శోధన మొదలు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అంతా అనుకున్నట్టు సాగితే అభిరామ్ దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటున్నారు.
Tags:    

Similar News