రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫైటర్ చిత్రానికి సర్వం సిద్ధమవుతోంది. జనవరి లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా పూర్తవుతున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే విజయ్ కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ను ఎంపిక చేసారు. తాజాగా సినిమాలో మరో నాయిక కూడా విజయ్ తో రోమాన్స్ చేయబోతుందని తెలుస్తోంది. పూరి- ఛార్మీ ముంబైలో మకాం వేసి సెకెండ్ హీరోయిన్ ఎంపిక చేసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ముంబై లో జల్లెడ పడుతున్నారు అంటే.. పూరి మరోసారి కొత్త మోడల్ ని దిగుమతి చేసే అవకాశం ఉంది.
పూరి సీనియర్ హీరోయిన్లు కన్నా కొత్త నాయికలపైనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడు. ఇప్పటివరకూ అలా ఎంతో మంది హీరోయిన్లను టాలీవుడ్ కి పరిచయం చేసి స్టార్ హీరోయిన్లను చేసాడు. ఆ కోవలోనే ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. మరో వైపు ఫైటర్ ని ఢీకొట్టడానికి బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ని రంగంలోకి దింపుతున్నట్లు మరో వార్త టాలీవుడ్ సహా బాలీవుడ్ ని వెడెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో కార్తికేయ ఓ ఆసక్తికర పాత్రలో నటించనున్నారని వార్తలొచ్చాయి.
బాలీవుడ్ నటులు.. హిందీలో పూరికి ఉన్న ఐడెంటిటీ.. ఇంటరనేషనల్ దిగ్గజం టైసన్ బరిలో దిగడం ఇదంతా చూస్తుంటే .. ఇది పాన్ ఇండియా కేటగిరీలో గొప్ప ప్రయత్నమేనని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరి-ఛార్మి- కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 30 కోట్లు సుమారుగా వసూలు చేసింది. తాజాగా పూరి ఇమేజ్ కి- రౌడీ స్టార్ తోడవ్వడంతో ఫైటర్ పై అంచనాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి.