స్కూల్ డేస్ మెమరీస్ ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ దశలో జరిగిన చిలిపి సన్నివేశాలు.. అల్లరి సంగతులు మన మనదిలో ఎప్పటికీ చెదిరిపోని మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి మధుర జ్ఞాపకాల్ని మళ్లీ మన ముందుకు తీసుకొస్తున్నారు `గరుడవేగ` అంజి. ఆయన తొలిసారి దర్శకుడిగా మారుతూ టెన్త్ క్లాస్ జ్ఞపాకాలతో ఓ సరికొత్త నేపథ్యంలో ఓ సినిమాని రూపొందిస్తున్నారు. `టెన్త్ క్లాస్ డైరీస్` పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీరామ్, అవికాగోర్, శ్రీనివాసరెడ్డి, శివ బాలాజీ, భానుశ్రీ, వేద, హిమజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్.ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ బ్యానర్ పై అచ్యుత్‌రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం కొంత మంది స్నేహితుల జీవితాల్లో జరిగిన తీపి, చేదు జ్ఞాపకాల సమాహరంగా `టెన్త్ క్లాస్ డైరీస్`ని రూపొందించారు. తాజాగా ఈ చిత్ర టీజర్ ని విడుదల చేశారు. `ప్రతీ ఒక్కరి జీవితం కథగా మారడం మొదలయ్యేది ఈ క్లాస్ రూమ్ లోనే .. అంటూ హీరో శ్రీరామ్ చెబుతున్న డైలాగ్ లతో టీజర్ మొదలైంది.
చిందిని కోసం శ్రీరామ్ గత 20 ఏళ్లుగా ఎదురుచూస్తుంటాడు. ఆ సమయం ఎప్పుడొస్తుందా? అని కోరుకుంటుంటాడు. ఈ నేపథ్యంలో రీ యూనియన్ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించాలని, దానికి స్నేహితుల్ని అందరిని ఆహ్వానించాలని తన స్నేహితురాలు హిమజతో చెబుతాడు. ఐడియా బాగుంది అంటుంది హిమజ. ఇంతకీ చాందిని శ్రీరామ్ ప్లాన్ చేసిన రీ యేనియన్ కి వచ్చిందా? .. హాఫ్ బాయిల్ ఎవరు? ..
చాందిని - శ్రీరామ్ ల మధ్య ఏం జరిగింది? .. తన వల్ల చాందిని జీవితం నాశనం అయిందని శివబాలాజీ ఎందుకు శ్రీరామ్ ని దూషించాడు అన్నది ఆసక్తికరంగా వుంది. అయితే రీ యూనియన్ థాట్ ఇప్పటికే `96` ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన `జాను`లో రావడంతో ఆడియన్స్ కొత్తగా ఫీలయ్యే అవకాశం లేదు. కానీ సరదా సన్నివేశాలు కొత్తగా వుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా మళ్లీ ప్రతీ ఒక్కరికీ తమ తమ స్కూల్ డేస్ ని గుర్తు చేయడం గ్యారంటీ అంటున్నారు. సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
Full View