`బాహుబలి` చిత్రంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమాతో ఆయనకు జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని జక్కన్న చేస్తున్న తాజా చిత్రం `ఆర్.ఆర్.ఆర్`. ఎన్టీఆర్- రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా... రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో దేశంలోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరపైకి రాబోతోంది. దీనికి తోడు సినిమాలో ఇద్దరు క్రేజీ హీరోలు తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.
విశాఖ సమీపంలోని అరకు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నా. ఈ చిత్రానికి హాలీవుడ్ స్టార్లని యాడ్ చేసి మరింత క్రేజ్ ని తీసుకొచ్చిన రాజమౌళి తెలంగాణ ప్రేక్షకుల్ని అలరించేందుకు మరో స్పెషల్ పర్సన్ ని బరిలోకి దించనున్నారని తెలుస్తోంది. తెలంగాణలో ప్రజా గాయకుడిగా.. ప్రజా యుద్ధ నౌకగా పేరున్న గద్దర్ పాటకు మంచి పేరుంది. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసి ఆలపించిన పాటలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. అది గమనించిన రాజమౌళి ఈ చిత్రం కోసం గద్దర్ తో ఓ పాటను పాడిస్తున్నారట. ఈ పాటని స్వయంగా గద్దరే రాస్తుండం మరో విశేషం.
ఈ పాట కొమరం భీమ్ పాత్రధారి ఎన్టీఆర్‌పై ఓ వీరోచితమైన సందర్భంలో వుంటుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ఇంకా ఇంకా అదనపు ఆకర్షణల్ని పెంచేందుకు రాజమౌళి తనవంతు ప్రయత్నం చేస్తుండడం ఆసక్తికరం. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రంలో అలియాభట్- అజయ్ దేవ్ గన్- రే స్టీవెన్ సన్ తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించనున్న ఈ చిత్రాన్ని దేశంలోని పది కీలక భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.