ప్ర‌భాస్ టీమ్ నుంచి మ‌రో స‌ర్ ప్రైజ్!

Update: 2022-02-26 10:34 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `భీమ్లానాయ‌క్‌` ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తొలి రోజు తొలి షో నుంచే ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ని సొంతం చేసుకుంది. థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల సంద‌డితో జాత‌ర వాతావ‌ర‌ణం మొద‌లైంది. ఓవ‌ర్సీస్ లోనూ భీమ్లాకు బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. ప్రీమియ‌ర్ షోల ప‌రంగా ఈ మూవీ ఇప్ప‌టికే రికార్డులు సృష్టించింది. ఫ‌స్ట్ డే వ‌సూళ్ల ప‌రంగానూ భీమ్లా స‌రికొత్త రికార్డులు సృష్టిండం మొద‌లుపెట్టింది. భీమ్లా థియేట‌ర్ల వ‌ద్ద చేస్తున్న సంద‌డితో ఆ త‌రువాత రానున్న సినిమాల‌కు మంచి ఊపొచ్చింది. దీంతో మేక‌ర్స్ రంగంలోకి దిగి భారీగా త‌మ చిత్రాల రిలీజ్ కోసం ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు.

`భీమ్లానాయ‌క్‌` త‌రువాత ఇమ్మిడియ‌ట్ గా థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న మూవీ `రాధేశ్యామ్‌`. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ఈ చిత్రం మార్చి 11న భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అయిపోయింది. ముందు ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 14న సంక్రాంతి కానుకగా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అయితే క‌రోనా, ఒమిక్రాన్ కార‌ణంగా ప‌రిస్థితుల మార‌డంతో అర్థాంత‌రంగా వాయిదా వేయాల్సి వ‌చ్చింది. తాజాగా ప‌రిస్థితులు అదుపులోకి రావ‌డంతో ఈ చిత్రాన్ని మార్చి 11న తెలుగు - త‌మిళ - మ‌ల‌యాళ - క‌న్న‌డ - హిందీ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు.

ఇటీవ‌లే మ‌ళ్లీ ప్ర‌మోష‌న్స్ ని మేక‌ర్స్ స్టార్ట్ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ ఓ విజువ‌ల్ వండ‌ర్‌. ఆ మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఐఫీస్ట్ గా నిల‌బోతోంద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ కి స‌రిగ్గా 14 రోజులు మాత్ర‌మే వుండ‌టంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని మ‌రింత స్పీడ‌ప్ చేసేసింది. ఇటీవ‌ల `ఈ రాత‌లే..` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని వ‌దిలిన మేక‌ర్స్ మ‌రో ట్రైల‌ర్ ని సిద్ధం చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే క‌ట్ చేసిన ట్రైల‌ర్ ని మార్చి 2న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఓవ‌ర్సీస్‌లో రిలీజ్ ప‌రంగా అరుదైన ఘ‌న‌త‌ని సాధించ‌బోతున్న ప్ర‌భాస్ ట్రైల‌ర్ తో ఆడియ‌న్స్ ని మ‌రింతగా మంత్ర‌ముగ్ధుల్ని చేయ‌బోతున్నార‌ట‌. మార్చి 10న ఈ మూవీ ప్రీమియ‌ర్స్ జ‌ర‌గ‌బోతున్న విష‌యం తెలిసిందే ఇందు కోసం ఇప్ప‌టికే రికార్డు స్థాయిలో థియేట‌ర్లు బుక్ అయిపోయాయి. అంత‌కు మించి స్క్రీన్ లు కూడా రికార్డు స్థాయిలో బుక్ కావ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇదిలా వుంటే రిలీజ్ కి మ‌రో రెండు వారాల స‌మ‌యం మాత్ర‌మే వుండ‌టంతో టీమ్ మొత్తం ప్ర‌మోష‌న్స్ కోసం రంగంలొకి దిగుతున్నార‌ట‌.

ప్రెస్ ఇంట‌రాక్ష‌న్ లు, ఇంట‌ర్వ్యూలు.. స్పెష‌ల్ షోల‌తో ప్ర‌చారాన్ని హోరెత్తించ‌బోతున్నార‌ట‌. ప్ర‌చారంలో భాగంగా ఓ భారీ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నార‌ని, దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ని త్వ‌ర‌లోనే చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంద‌ని తెలిసింది. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన‌ ఈ మూవీలో  హీరోయిన్ గా పూజా హెగ్డే .. కీల‌క పాత్ర‌ల్లో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు , భాగ్య‌శ్రీ క‌నిపించ‌బోతున్నారు.
Tags:    

Similar News