అదే నిజమైతే యశ్‌ కొత్త సినిమాకు మరో మూడేళ్లు..!

Update: 2022-12-26 09:53 GMT
కన్నడ రాక్ స్టార్‌ యశ్‌ కేజీఎఫ్‌ 2 తర్వాత చేయబోతున్న సినిమా గురించి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు రాఖీ భాయ్ కొత్త సినిమా ఎప్పుడు అంటూ చర్చించుకుంటున్నారు. ఆయన్ను సోషల్‌ మీడియా ద్వారా పదే పదే ప్రశ్నిస్తున్నారు. అయినా కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.

కేజీఎఫ్‌ 2 సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న యశ్‌ తదుపరి సినిమాను అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని ఆ మధ్య ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ భారీ బడ్జెట్‌ సినిమా ఏంటీ అనేది యశ్ నుండి స్పష్టత రాలేదు.

మొన్నటి వరకు కన్నడ స్టార్‌ డైరెక్టర్ నర్తన్ తో ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నర్తన్‌ తో సినిమా కూడా కన్ఫర్మ్‌ అవ్వలేదని తన కొత్త సినిమా గురించిన విషయం తెలియడానికి కాస్త సమయం పడుతుందని యశ్‌ అన్నాడట.

తాజాగా కన్నడ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో యశ్‌ యొక్క తదుపరి సినిమా కేజీఎఫ్‌ 3 అంటూ ప్రచారం చేస్తున్నారు. కేజీఎఫ్‌ 2 స్థాయిలో ఉండాలి అంటే కేజీఎఫ్ 3 ని చేస్తేనే బాగుంటుందని యశ్‌ భావిస్తున్నాడట. ఆలస్యం అయినా పర్వాలేదు కానీ కేజీఎఫ్ 3 తోనే రావాలని యశ్‌ భావిస్తున్నాడట.

ఒక వేళ యశ్‌ నిజంగానే తన తదుపరి సినిమాగా కేజీఎఫ్ 3 ని చేయాలి అనుకుంటే ఆ సినిమా ప్రారంభం అయ్యేందుకే మూడు సంవత్సరాలు పడుతుంది.. విడుదల కావడానికి మరో రెండేళ్ల సమయం పడుతుంది. అంటే అయిదు సంవత్సరాల వరకు యశ్ తదుపరి సినిమా కోసం వెయిట్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా సలార్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది వరకు పూర్తి అయ్యే పరిస్థితి లేదు. వచ్చే ఏడాది చివరికి ఎన్టీఆర్ సినిమాను ప్రశాంత్‌ నీల్‌ చేయబోతున్నాడు. ఎన్టీఆర్ సినిమా ను చేసేందుకు కచ్చితంగా మరో రెండేళ్ల సమయం అయినా పడుతుంది.

అంటే యశ్‌ తో ప్రశాంత్‌ నీల్‌ సినిమా మొదలు పెట్టడానికి మూడు సంవత్సరాల సమయం పడుతుందని.. ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సినిమా తీయాలి అంటే కచ్చితంగా రెండేళ్ల సమయం తీసుకుంటాడు. కనుక యశ్ అయిదు సంవత్సరాల పాటు వెయిట్‌ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. నిజంగానే యశ్‌ అప్పటి వరకు వెయిట్‌ చేస్తాడా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News