కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు మూతబడి ఉండటంతో చాలా సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. దీంతో ఓటీటీ వేదికలు సినిమాల రిలీజ్ లకు ప్రత్యామ్నాయంగా మారాయి. ఇప్పటికే అనేక చిత్రాలు డైరెక్ట్ ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎప్పటి నుంచో థియేట్రికల్ రిలీజ్ చేయాలని ఎదురు చూసిన మేకర్స్ కూడా ఇప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటీటీ విడుదలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ వార్ డ్రామా ''షేర్షా'' చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా 'షేర్షా' రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ టీజర్ ని మేకర్స్ వదిలారు.
'షేర్షా' చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా - కియరా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించారు. తమిళంలో 'బిల్లా'.. తెలుగులో 'పంజా' వంటి చిత్రాలను తెరక్కించిన స్టార్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1999 కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన పరమవీర చక్ర అవార్డ్ గ్రహీత కెప్టెన్ విక్రమ్ భాత్ర జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో బాత్రా పాత్రలో సిద్ధార్థ మల్హోత్రా కనిపిస్తున్నారు.
'22 ఏళ్ల క్రితం కార్గిల్ లో 16,000 అడుగుల ఎత్తులో శత్రువులను మన సైనికులు ఓడించారు.. వారిలో కొందరు తిరిగి రాలేదు..' అంటూ వచ్చిన 'షేర్షా' టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో కార్గిల్ యుద్ధం సమయంలోని రియల్ ఫుటేజ్ ని మరియు కెప్టెన్ బాత్రా సహచరుల అభిప్రాయాలను పొందుపరిచారు. ఇక చివర్లో విక్రమ్ బాత్రా పేరుతో ఉన్న ఆర్మీ యూనిఫాం ధరించిన సిద్ధార్థ్.. శత్రువులపై గన్ గురి పెట్టడం చూపించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధం అనేది ఇండియా యొక్క ఫస్ట్ టెలివైజ్డ్ వార్ అని మేకర్స్ పేర్కొన్నారు.
ధర్మ ప్రొడక్షన్స్ మరియు కాశ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై కరణ్ జోహార్ - అపూర్వ మెహతా - షబ్బీర్ కలిసి 'షేర్షా' చిత్రాన్ని నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ లో ఆగస్ట్ 12న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని అడవి శేష్ 'మేజర్' చిత్రానికి పోటీగా జులై 2న రిలీజ్ చేయాలని భావించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డిజిటల్ రిలీజ్ కి వెళ్తున్నారు. అయితే ఇక్కడ కూడా 'షేర్షా' కి పోటీగా అజయ్ దేవగన్ నటించిన వార్ డ్రామా 'భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' వస్తోంది. 1971 ఇండో-పాక్ యుద్ధం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 13న డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇండిపెండెన్స్ వీక్ లో వస్తున్న ఈ రెండు సినిమాలు కూడా దేశభక్తి ని పెంపొందించే బయోపిక్స్ అవడం విశేషం.
Full View