బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. దశాబ్ధాల పాటు సీనియర్ కొరియోగ్రాఫర్ గా ఆయనకు ఉన్న గౌరవమర్యాదలకు భంగం కలిగే పరిస్థితి ఈ ఆరోపణలతో నెలకొంది. గణేష్ ఆచార్య ఇంతకుముందు.. తెలుగులోనూ పలువురు స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేయడంతో ఇక్కడా ఈ వార్తలు సంచలనం అయ్యాయి. ఇటీవలే తనూశ్రీ దత్తా సైతం నీ లెక్క తెలుస్తానంటూ హెచ్చరించడంతో...ప్రతిగా గణేష్ ఆచార్య అంతే ధీటుగా బధులివ్వడం ఎంతటి సంచలనమైందో తెలిసిందే. ముంబై పోలీస్ స్టేషన్ లో పలువురు బాధిత నటీమణులు ఫిర్యాదులు చేయడం...ఎఫ్ ఐఆర్ నమోదు కావడంతో గణేష్ ఆచార్య ఉక్కిరి బిక్కిరి అయ్యే సన్నివేశం ఎదురైంది.
తాజాగా మరో మహిళ జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేసింది. 1990లో ముంబై అంథేరిలోని సహిబా హాల్ లో పలువురు మాస్టర్లు డ్యాన్స్ క్లాసులు తీసుకునేవారని.. కమల్ మాస్టర్ వద్ద ఆచార్య అసిస్టెంట్ గా పనిచేసేవాడని బాధిత మహిళ చెప్పుకొచ్చింది. 18 ఏళ్ల వయసులో నాన్ మెంబర్ డాన్సర్ గా పనిచేస్తున్నప్పుడు క్లాసుల పేరుతో తనని హోటల్ కి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మాయ మటాలు చెప్పి అసభ్యంగా ప్రవర్తించేవాడని.. పీరియడ్స్ టైమ్ లో కూడా విడిచి పెట్టేవాడు కాదని సంచలన ఆరోపణలు చేసింది.
అయితే గణేష్ ఆచార్య ఈ ఆరోపణల్ని ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో కార్మిక సంఘాలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నించడాన్ని తాను వ్యతిరేకించేవాడినని అందువల్లే తనపై ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని గణేష్ ఆచర్య వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా భయపడనని.. తనపై ఆరోపించిన మహిళను హెచ్చరించాడు.