మొదటి సినిమా నచ్చితే తన రేంజ్ పట్టించుకోకుండా అవకాశం ఇవ్వడంలో ముందుంటాడు ప్రభాస్. తన డేట్స్ కోసం స్టార్ డైరెక్టర్ క్యూ లో ఉన్నప్పటికీ కొత్త దర్శకుల వైపే చూస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. గతం సుజీత్ మొదటి సినిమా 'రన్ రాజా రన్' చూసి రెండో సినిమా నాతోనే చేస్తున్నావ్ అంటూ మాటిచ్చి నిలబెట్టుకున్న ప్రభాస్ రాదా కృష్ణకు కూడా జిల్ తర్వాత అలాగే చాన్స్ ఇచ్చి సినిమా చేస్తునాడు.
అయితే లేటెస్ట్ గా మరో డెబ్యూ డైరెక్టర్ వర్క్ కి ఇంప్రెస్ అయి నాతో సినిమా చేస్తావా అంటూ ఓ ఇంటర్వ్యూ లో అడిగేసాడు ప్రభాస్. కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా పరిచయమైన 'మత్తు వదలరా' తో డెబ్యూ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు రితేష్ రానా. ఇటివలే ఈ సినిమా చూసిన ప్రభాస్ రితేష్ రానాను ఇంటర్వ్యూ చేసాడు. సినిమా మేకింగ్ గురించి కొన్ని ప్రశ్నలు వేసిన అనంతరం "నీ దగ్గర కథ ఉంటే నాతో సినిమా చేస్తావా" అంటూ అడిగేసాడు. ఆ ప్రశ్నతో ఉబ్బి తబ్బియిపోయాడు రితేష్.
'బాహుబలి'ఫ్రాంచైజీతో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తో సినిమా అంటే ఏ డైరెక్టర్ కయినా అంతకంటే ఏం కావాలి..? మరి సుజీత్ , రాధా కృష్ణ లాగే రితేష్ కూడా రెండో సినిమాకు ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఉంది.