కేరళ కుట్టి నజ్రియా నజీమ్ 'అంటే సుందరానికీ' సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో లీల పాత్రలో అమ్మడు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. నేచురల్ పెర్పార్మెన్స్ తో మెప్పించే ప్రయత్నం కొంత వరకూ సక్సెస్ అయింది. తనలో ఈ క్వాలీటీనే మాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ చేసింది. స్ర్కిప్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది.
గ్లామర్ పాత్రలకు ఏమాత్రం స్కోప్ ఇవ్వదు. కేవలం పెర్మార్మెన్స్ ఓరియేంటెడ్ రోల్స్ తప్ప అందాల ఆరోబోతకు నో వే అనేస్తుంది. మరి ఈ ట్యాలెంట్ టాలీవుడ్ కి సరిపోతుందా? అంటే నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. సుందరం సినిమాలో పెర్పార్మెన్స్ వరకూ ఒకే. కానీ టాలీవుడ్ మేకర్స్ అంతా ఒకే తరహాలో సినిమాలు చేయరు. టాలీవుడ్ అంటే అందాల ఆరబోత తప్పనిసరి.
వాణిజ్య అంశాల్ని దృష్టిలో పెట్టుకునే టాప్ దర్శకులంతా సినిమాలు చేస్తారు. హీరోలతో పెదవి ముద్దు సన్నివేశాల్లో నటించాలి. డూప్ అంటే కుదరదు. వాస్తవం ఉట్టిపడాలంటే రియల్ గా నటించాల్సిందే. ఆ చిత్రాల్లో భాగమవ్వాలంటే గ్లామర్ డోస్ తప్పనిసరి. అందులో మడి కట్టుకుని కూర్చుంటానంటే అవకాశమే గగనం అవుతుంది. అలా అనుకుని వచ్చిన ఎంతో మంది హీరోయిన్లు మళ్లీ బ్యాక్ టూ పెవిలియన్ కే చేరుకున్నారు.
సుందరం సినిమాలో నాని-నజ్రియా మధ్య ఒక్క రొమాంటిక్ సీన్ కూడా ఉండదు. కథకి అవసరం లేదని భావించారో... నజ్రియా నటించదని రొమాన్స్ పెట్టలేదో తెలియదు గానీ..టాలీవుడ్ లో మాత్రం గ్లామర్ పాత్రలకు ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకటి మాత్రం వాస్తవం. నజ్రియాని ఏరికోరి సుందరం సినిమాకి ఎంపిక చేసారు.
చాలా మంది ప్రత్నించి విఫలమయ్యారని..మేము మాత్రమే నజ్రియాని ఒప్పించడంలో సక్సెస్ అయ్యామని నాని గర్వంగా చెప్పుకొచ్చారు. అంటే నజ్రియా రొమాంటిక్ సన్నివేశాలకు ముందే ఒప్పుకోదని తెలిసి తమ సినిమాలో నటించడమే గొప్పగా భావించి సుందరం టీమ్ ఫీలైనట్లు కనిపిస్తుంది.
మరి నజ్రియాకి తదుపరి కూడా టాలీవుడ్ నుంచి అదే తరహా గౌరవం దక్కతుందా? లేక మరో వంద మంది నజ్రియాల్ని దిగుమతి చేయడానికి ఆస్కారం ఉందని ప్రూవ్ చేస్తుందా? అన్నది కొన్నాళ్లు వెయిట్ చేస్తే గానీ తెలియదు.