చాక్లెట్ కేక్ స‌రే.. ఎవ‌రా ఫేవ‌రెట్ అనూ?

Update: 2019-08-03 11:31 GMT
రెండు హిట్లు నాలుగు ఫ్లాపులు అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్ ని డైలమాలో ప‌డేసిన సంగ‌తి తెలిసిందే. చిన్న హీరోలు పెద్ద హిట్లిస్తే.. పెద్ద హీరోలు పెద్ద ఫ్లాపులిచ్చి ఈ ప‌రిస్థితి తెచ్చారు. నాని- రాజ్ త‌రుణ్ కెరీర్ కి పెద్ద బూస్ట్ ఇచ్చారు. ప‌వ‌న్ - బ‌న్ని క‌లిసి ఊహించ‌ని ఝ‌ల‌క్ లు ఇచ్చారు. అజ్ఞాత‌వాసి- నా పేరు సూర్య డిజాస్ట‌ర్లు ఈ మ‌ల‌యాళ‌ బ్యూటీని ఎటో తీసుకెళ్లిపోయాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో సినిమాల్లేక ఖాళీ. ఈ స‌న్నివేశంలో ఏం చేయాలో ఊసుపోని అనూ ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లో ట్ర‌య‌ల్స్ లో ఉందిట‌.

త‌మిళంలో ప్ర‌స్తుతం ఓ రెండు సినిమాలు చేస్తోంది. అందులో శివ‌కార్తికేయ‌న్ న‌టిస్తున్న 16వ సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అలాగే నాన్ రుద్ర‌న్ అనే వేరొక సినిమాలోనూ ఇటీవ‌ల ఛాన్స్ ద‌క్కించుకుంది. ఈ రెండు సినిమాల‌తో కోలీవుడ్ లో అయినా పాగా వేయాల‌న్న‌ది ప్లాన్. అక్క‌డ స‌క్సెస్ ని బ‌ట్టి నెక్ట్స్ ఏంటో డిసైడ్ అవుతుంది. ఇక‌పోతే ఇటీవ‌లే తేన్ కాశీలో షూటింగ్ లో పాల్గొన్న ఈ బ్యూటీ అక్క‌డ కొండ‌ల అందానికి మురిసిపోయి సెల్ఫీలు దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

తాజాగా తీరిగ్గా ఓ బేక‌రీకి వెళ్లి అక్క‌డ చాక్లెట్ కేక్ - పేస్ట్రీలు తింటోంది. త‌న ముందు ప్లేట్లో చాక్లెట్ కేక్ ఉంది. ఆ ప‌క్క‌నే మ‌రో ఫేవ‌రెట్ బోయ్ ఎవ‌రో ఉన్నార‌ట‌. అత‌డెవ‌రో చెప్ప‌కుండా క‌నిపెట్టుకోండి చూద్దాం! అంటూ ఫ్యాన్స్ కి ప‌జిల్ వేసింది. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన కేక్ తో పాటు బోయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అక్క‌డ. ఇంత‌కీ ఆ బోయ్ ఎవ‌రో చెప్మా? అంటూ జ‌నం జుత్తు పీక్కుంటున్నారు. ఇంత‌కీ ఎవ‌రై ఉంటారు? ఎవ‌రైనా హీరోనా?  లేక  విదేశాల‌కు చెందిన బిజినెస్ మేనా?

    
    
    

Tags:    

Similar News