అనుకి సూర్యనే రక్ష

Update: 2018-01-11 08:48 GMT
అజ్ఞాతవాసితో తన రేంజ్ మారిపోతుంది అని కలలు కన్న అను ఇమ్మానియేల్ కు టైం ఇంకా కలిసిరానట్టే ఉంది. సినిమా అసలే పూర్తి డివైడ్ టాక్ తో నడుస్తోంది. సినిమా పరంగా తీవ్రమైన విమర్శలు అందుకున్న అంశాల్లో హీరొయిన్ రోల్స్ గురించి కూడా ఉంది. పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లో - సింక్ కాని లవ్ ట్రాక్స్ తో త్రివిక్రమ్ ఫస్ట్ టైం కథానాయికను పేలవంగా తీర్చిదిద్దారు అనే కామెంట్ బలంగా వినిపిస్తోంది. మెయిన్ హీరొయిన్ కీర్తి సురేష్ కే అలాంటి ఫీడ్ బ్యాక్ వస్తే ఇక అను ఇమ్మానియేల్ గురించి చెప్పేది ఏముంది. ఇంట్రో సీన్లో టాయిలెట్ లో కూర్చుని సిగరెట్ తాగుతున్నట్టు చూపించి కామెడీ చేయబోయి రివర్స్ అయిన  సూర్యకాంతం పాత్రలో అనుకి ఇది ఏ మాత్రం సెట్ కాలేదు. దీంతో ఇప్పుడు ఆశలన్నీ అల్లు అర్జున్ నా పేరు సూర్య మీదే పెట్టుకుంది.

అను నటన పరంగా లోపాలు లేకపోయినా తాను చేస్తున్న హీరోలు మంచి ఇమేజ్, స్టార్ స్టేటస్ ఉన్న వారే అయినా వాటి ఫలితం మాత్రం ఇబ్బంది పెడుతోంది. నాని మజ్ను యావరేజ్ గా నిలిచినా అనుకు పేరు వచ్చింది. రాజ్ తరుణ్ తో చేసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త తనను కథలో ఎంపికలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించేలా చేసింది. పవన్ సినిమా కాబట్టి అజ్ఞాతవాసి గురించి ఏమి ఆలోచించే అవసరం పడలేదు. పాటల్లో మాత్రం మంచి గ్లామర్ ఒలకబోసిన అను నా పేరు సూర్య కనక హిట్ అయితే స్టార్ హీరోస్ పక్కన మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశ పడుతోంది. ఇది తెలియాలంటే ఏప్రిల్ 27 దాకా ఆగాలి.
Tags:    

Similar News