ఈ మధ్య టాలీవుడ్ లోకి మలయాళ భామల దాడి ఎక్కువగానే ఉంది. కీర్తి సురేష్ - అనుపమా పరమేశ్వరన్ లు ఇక్కడ సత్తా చాటేస్తున్నారు. అయితే.. మళయాళ ఇండస్ట్రీలో ఓ కొత్త సెంటిమెంట్ ఏర్పడింది. నివీన్ పౌలీకి జంటగా అరంగేట్రం చేసిన హీరోయిన్స్ అందరికీ ఇతర భాషల్లో ఆఫర్స్ రావడం గ్యారంటీ అని. నమితా ప్రమోద్ - ఇషా తల్వార్ లు ఇలాగే ఇతర ఇండస్ట్రీలలో ఛాన్సులు దక్కించుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో భామ వచ్చి చేరింది. నివీన్ పౌలీ నెక్ట్స్ ప్రాజెక్ట్ తో అను ఇమ్మాన్యుయేల్ అరంగేట్రం చేస్తోంది. అక్కడ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు కానీ.. ఇప్పుడీ భామ కూడా టాలీవుడ్ లోకి వచ్చేస్తోంది.
అమెరికా నుంచి వచ్చిన అను ఇమ్మాన్యుయేల్.. నేటివ్ గా మళయాళీనే. ఈమె గోపీచంద్ రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఆక్సిజన్ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. 'మేము ఆక్సిజన్ కోసం కొత్త హీరోయిన్ ని అన్వేషిస్తున్నాం. ఈ రోల్ కి అను కరెక్ట్ ఆప్షన్ అనుకున్నాం. ఆక్సిజన్ ఒక యాక్షన్ థ్రిల్లర్ అని, ఇందులో బోల్డ్ గా ఉండే పెర్ఫామెన్స్ బేస్డ్ రోల్ చేయాల్సి ఉంటుందని చెప్పామంతే' అంటూ చెప్పాడు డైరెక్టర్ జ్యోతికృష్ణ.
మరికొన్ని రోజుల్లోనే అను ఆక్సిజన్ షూటింగ్ లో పాల్గొననుంది. ఈ మూవీలో రాశిఖన్నా మరో లీడ్ హీరోయిన్ కాగా, సీనియర్లు జగపతిబాబు - సితార కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.