టాలీవుడ్ లో దూసుకుపోతోన్న లేటెస్ట్ భామ అను ఇమాన్యుయేల్. హీరోయిన్ గా మారిన తర్వాత.. నటిగా తన జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది అను. అయితే.. కెరీర్ ప్రారంభం నుంచి ఎదుర్కొంటున్న సవాల్ మాత్రం ఇప్పటికీ కంటిన్యూ అవుతోందట. సరైన పాత్రలను ఎంచుకోవడం మాత్రం చాలా కష్టమైన విషయం అన్నది అను ఇమాన్యుయేల్ చెబుతున్న మాట.
“మజ్ను మూవీతో సక్సెస్ ఫుల్ గా లాంఛ్ అయిన తర్వాత.. సరైన రోల్స్ ను ఎంచుకోవడం చాలా కష్టం అయిపోయింది. అయితే అదృష్టవశాత్తూ నా మొదటి సినిమా రిలీజ్ కంటే ముందే.. నా చేతిలో తెలుగు సినిమాలు ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే చెప్పాలంటే.. నేను చాలా లక్కీ. పైగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వస్తుండడంతో.. నా పని ఇంకా తేలిక అయిపోయింది. అయితే.. పేరెంట్స్ కు దూరంగా ఉండడం మాత్రం కష్టమైన విషయం. సుదీర్ఘ కాలంపాటు తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడం... మొదట్లో బాగా ఇబ్బంది పెట్టింది. వారితో రెగ్యులర్ గా మాట్లాడుతున్నా.. అడ్జస్ట్ అవడం కష్టమే అనిపించింది. ఇలాంటి సమయంలో నాకు నేను వర్క్ పెంచుకున్నాను. మెల్లమెల్లగా అలవాటయిపోయింది” అని చెబుతోంది అను.
“షోబిజ్ అంటేనే చాలా కష్టాలు ఉంటాయి. పొద్దునే నిద్రలేవాలి.. షెడ్యూల్స్ ఓ క్రమ పద్ధతిలో ఉండవు.. ఇండస్ట్రీలో ఒక్కోరిని ఒక్కో రకంగా ట్రీట్ చేయాలి. అయినా సరే.. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ.. ఈ ప్రొఫెషన్ ను ఎంజాయ్ చేస్తున్నా” అని చెప్పింది ఈ మలయాళీ బ్యూటీ. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న అను ఇమాన్యుయేల్ ను.. తర్వాత తను ఎన్టీఆర్ తో తీయబోయే మూవీకి కూడా త్రివిక్రమ్ రిపీట్ చేయనున్నాడనే టాక్ ఉంది.