అక్కినేని నాగచైతన్య సరసన `శైలజారెడ్డి అల్లుడు` చిత్రంలో కథానాయికగా నటించింది అను ఇమ్మాన్యుయేల్. `అజ్ఞాతవాసి` - `నా పేరు సూర్య` లాంటి డిజాస్టర్ల తర్వాత అనూ నటించిన చిత్రమిది. ఈ సినిమాపైనే అనూ ఆశలన్నీ. సెప్టెంబర్ 13న మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ ఏడెకరాల్లో జరిగిన చిట్ చాట్ లో అనూ వేడెక్కించే మాటొకటి చెప్పింది. ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ ఇది.
శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో అల్లుడి పాత్రలో నాగచైతన్య అద్భుతంగా నటించాడని చెప్పిన అనూ తన పాత్ర గురించి ఆసక్తికరమైన పాయింట్ ఒకటి చెప్పింది. ఇదివరకూ ట్రైలర్ - పోస్టర్లలో చూపించినట్టే నా పాత్ర తీరుతెన్నులు ప్రత్యేకంగా ఉంటాయి. నేను ఈ చిత్రంలో రమ్యకృష్ణ కూతురిగా కనిపిస్తాను. ఈగో నెత్తికెక్కిన కూతురిగా నా నటన మీకు నచ్చుతుంది అని చెప్పింది. స్వతహాగానే మీరు ఈగోయిస్టా? అన్న ప్రశ్నకు .. ఎస్ నిజమే.. నేను వ్యక్తిగతంగానూ ఈగోయిస్టునే అని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. బయట ఎలా ఉంటానో అలానే తెరపైనా నటించే అవకాశం వచ్చిందని నవ్వేసింది.
మొత్తానికి అనూ తెలిసో తెలియకో నోరు జారింది. రేపు ఉదయం అన్ని దినపత్రికల్లోనూ ఇదే హెడ్డింగ్ దర్శనమివ్వడం ఖాయం. కొన్ని ఆంగ్ల పత్రికల్లో ఇదే హెడ్డింగ్ పెట్టేయడం ఖాయమైంది. అనూ పొరపాటున అనేసింది. నేను రీల్ లైఫ్ లో - రియల్ లైఫ్ లో ఈగో్యిస్టునే అంది. ఇప్పుడు అదో హాట్ డిబేట్ అయిపోయింది. ఈగో ఉండడం అవసరమే. కానీ పురుషాధిక్య ప్రపంచంలో ఈగోయిస్టిక్ కథానాయికలకు అవకాశాలు రావడం అంత సులువేం కాదు. తలబిరుసు చూపిస్తే కెరీర్ పరంగా రాంరాం ఖాయం. ఈ తరహాలో ఇటీవల సాయిపల్లవి పేరు బాగా పాపులరైపోయింది. ఈ అమ్మడికి తలబిరుసు అంటూ బోలెడంత ప్రచారం సాగింది. ఇకపై ఆ లిస్ట్‌లో అనూ ఇమ్మాన్యుయేల్ పేరు మార్మోగిపోవడం ఖాయమన్న ముచ్చట సాగుతోంది. అయితే అనూ ఈగోయిస్టే అయినా, తన మాట తీరు మాత్రం చాలా స్వీట్. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే నివసిస్తున్న అనూ.. పూర్తిగా కెరీర్ పైనే శ్రద్ధ పెట్టానని చెప్పింది. కొన్ని ఫ్లాపులొచ్చిన మాట నిజం. కానీ శైలజారెడ్డి అల్లుడు బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని నమ్మకం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 13న ఈ చిత్రం రిలీజవుతున్న సంగతి తెలిసిందే.