ఫోటో స్టొరీ: సింపుల్ బట్ బ్యూటిఫుల్

Update: 2019-02-05 14:45 GMT
'మజ్ను' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళం భామ అను ఇమ్మాన్యుయేల్ అతితక్కువ సమయంలోనే టాప్ లీగ్ స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ సినిమాలలో అవకాశాలు సాధించి అందరిని ఆశ్చర్య పరిచింది.  కానీ బ్యాడ్ లక్.. 'అజ్ఞాతవాసి'.. 'నా పేరు సూర్య' రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.  దీంతో స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న అను కాస్తా సాధారణ హీరోయిన్ గానే ఉండిపోయింది.

ఆ సంగతేమోగానీ ఈ భామ మిగతా హాటు హీరోయిన్లలాగానే సోషల్ మీడియాలో యమా యాక్టివ్. తరచుగా హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులను.. అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.  తాజాగా అను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు.   ఫోటోలో గ్రే కలర్ స్లీవ్ లెస్.. డీప్ కట్ గౌన్ లో దర్శనమిచ్చింది.  ఇలాంటి డ్రెస్ లో క్లీవేజ్ అందాల ప్రదర్శన ఆటోమేటిక్ గా జరిగిపోతుంది కదా.  మేకప్ బాగానే దట్టించింది కానీ యాక్సెసరీస్ అసలేవీ లేకుండా.. జస్ట్ ఇయర్ పిన్స్ లాంటివి మాత్రమే పెట్టుకుంది.  ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది. పుట్టి పెరిగింది అమెరికా కదా.. స్టైల్ న్యాచురల్ గా వచ్చేసింది. సింపుల్ బట్ బ్యూటిఫుల్.

ఈ భామ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే నాగార్జున సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిందట.  ఈ సినిమా తప్ప ఇతర ఆఫర్లేమీ లేవు. మరి నాగార్జున సినిమా అయినా తనకు బిగ్ బ్రేక్ ఇస్తుందేమో వేచి చూడాలి.
Tags:    

Similar News