ఈమద్య కాలంలో థియేటర్ రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు నాలుగు వారాల్లోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం ఎక్కువ గ్యాప్ తో వస్తున్నాయి. థియేటర్ లో సందడి చేయలేక పోయిన సినిమాలు నాలుగు వారాల కంటే ముందే ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వచ్చిన అనుభవించు రాజా సినిమా రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా వచ్చే వారం ఆహా ద్వారా స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కేవలం మూడు వారాల్లోనే అనుభవించు రాజా సినిమా ను ఆహా వారు స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం అవ్వడం చర్చనీయాంశం అయ్యింది.
సినిమా ఇప్పటికే థియేటర్ల లో కనిపించకుండా పోయింది. వచ్చే వారంకు ఒకటి రెండు చోట్ల ఉంటే అక్కడ కూడా తీసేసే అవకాశాలు ఉంటాయి. కనుక అనుభవించు రాజా సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటున్నారు. మొన్నటి వరకు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగాయి.
ప్రతి ఒక్కరు కూడా సినిమా పై అంచనాలతో ఉన్నారు. అంచనాలు ప్రతి ఒక్కరు సినిమా గురించి మాట్లాడుకున్నారు. కనుక వెంటనే ఓటీటీ లో స్ట్రీమింగ్ అయితే మంచి ఫలితం ఉంటుందనే నమ్మకంతో ఆహా టీమ్ మరో వారం రోజులు ఉండగానే స్ట్రీమింగ్ కు నిర్మాతల వద్ద నుండి అనుమతి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
రాజ్ తరుణ్ మరియు కశీష్ ఖాన్ జంటగా రూపొందిన ఈ సినిమా కు శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించాడు. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా లో రాజ్ తరుణ్ పాత్ర చాలా నాచురల్ గా ఉందనే టాక్ వచ్చింది. పల్లెల్లో ఉండే పరిస్థితులను చక్కగా చూపించారు. అయితే సినిమా కరోనా ఇతర కారణాల వల్ల థియేటర్ల ద్వారా ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.
సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఆహా లో ఈమద్య కాలంలో చిన్న సినిమా లు స్ట్రీమింగ్ అయ్యి పెద్ద విజయాలను దక్కించుకుంటున్నాయి. అందుకే ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఆహా లో మంచి టాక్ దక్కించుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.