యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ''అనుభవించు రాజా''. శ్రీను గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పల్లెటూరి నేపథ్యంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. టైటిల్ కు తగ్గట్లుగానే ఇందులో జూదాలను ఇష్టపడే పందెం రాయుడు పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు టీజర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.
''అనుభవించు రాజా'' టీజర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల అవుతుందని చిత్ర బృందం తెలిపింది. రేపు (సెప్టెంబర్ 23) బుధవారం ఉదయం 10.08 గంటలకు కలర్ ఫుల్ టీజర్ ను వదులుతారని ప్రకటించారు. చరణ్ సపోర్ట్ వల్ల రాజ్ తరుణ్ సినిమా ఎక్కువ మంది దృష్టిలో పడే అవకాశం ఉంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సహకారంతో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుప్రియ యార్లగడ్డ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రాజ్ తరుణ్ సరసన కాశిష్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. పోసాని కృష్ణమురళి - ఆడుకాలమ్ నరేన్ - అజయ్ - సుదర్శన్ - టెంపర్ వంశీ - ఆదర్శ్ బాలకృష్ణ - రవి కృష్ణ - భూపాల్ రాజు - అరియానా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. గేయ రచయిత భాస్కరభట్ల సాహిత్యం రాస్తున్నారు. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'అనుభవించు రాజా' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.