ఎందుకో తెలియదు కాని.. దర్శకుడు పూరి జగన్ ''ఇజం'' సినిమాను మొత్తంగా స్పానిష్ బాషతో నింపేసినట్లే ఉన్నాడు. ఆల్రెడీ డెస్పరాడో కాకరకాయ్ అంటూ మనోడు స్పానిష్ బాషతో ట్రైలర్లోనే తన ఇజాన్ని చూపించాడు. ఈ స్పానిష్ బాషకు సినిమా కథతో ఏమన్నా సంబంధం ఉందేమో తెలియదు కాని ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ మెటీరియల్లో కూడా స్పానిజం బాగా కనిపిచ్చేత్తాంది.
మ్యుజిక్ రిలీజ్ అనే విషయాలన్ని ''మ్యూజికా రిలీజో'' అంటూ ఇన్నోవేటివ్ గా ప్రకటిస్తున్నారు పూరి. ఈ బుధవారం సాయంత్రం ''ఇజం'' కోసం అనూప్ రూబెన్స్ అందిస్తున్న మ్యూజిక్ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏటంటే.. మామూలుగా ఈ మధ్యన చిన్న సినిమా అయినా ఏదో ఒక న్యూస్ ఛానల్ కు ఒక ఎంటర్టయిన్మెంట్ ఛానల్ కు టెలికాస్ట్ రైట్స్ అమ్మేస్తున్నారు. కాని ఇజం సినిమాను మాత్రం ఎవ్వరికీ అమ్మలేదు. అన్ని ఛానళ్లకూ ఫీడ్ ఇస్తారట. అందరూ లైవ్ కెమెరాలతో వచ్చేస్తే చాలట.
అంటే నెట్ న్యూట్రాలిటీ తరహాలో మన పూరి జగన్ ఇప్పుడు ఆడియో టెలికాస్ట్ రైట్స్ కోసం కూడా న్యూట్రాలిటీ పద్దతి పాటించాడా? అందుకే అనేది.. పూరి జగన్ ఏం చేసినా కూడా రచ్చ రంబోలా టైపులో చాలా కొత్తగా ఉంటుందని. నిర్మాతలకు తగ్గితే ఆ రైట్ల తాలూకు డబ్బులు తగ్గుతాయేమో కాని.. మీడియా వారందరూ ఫుల్ ఖుషీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/