మాన్లీ లుక్.. స్టయిలిష్ అప్పియరెన్స్.. జిమ్నాస్టిక్ బాడీ.. అదరగొట్టే స్టంట్స్... ఇవన్నీ హీరోలకే ఉంటాయి. హీరోలకు పోటీగా ఇవన్నీ మెయిన్ టెయిన్ చేస్తూ విలన్ గా తెగ ఇంప్రెస్ చేస్తున్నాడు అనూప్ సింగ్ ఠాగూర్. ఇంతవరకు విన్నర్ అండ్ రోగ్ సినిమాల్లో ఈ కండల వీరుడు విలన్ గా కనిపించాడు. దీంతోపాటు సూర్య హీరోగా నటించిన సింగం-3లోనూ అనూప్ బ్యాడ్ గయ్ గా కనిపించాడు.
విలన్ గా తన స్టయిల్ తో మెప్పించిన అనూప్ ఈసారి స్టయిలిష్ స్టార్ నే ఢీకొడుతున్నాడు. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్యలో అనూప్ సింగ్ విలనిజం ఓ రేంజిలో ఉండబోతోందనేది సినిమా యూనిట్ లో వినిపిస్తున్నటాక్. ఇంతవరకు తాను నటించిన అన్ని సినిమాల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాపేరుసూర్య లోనే అని స్వయంగా అనూప్ అంటున్నాడు. కెరీర్ లో తొలిసారి అల్లు అర్జున్ తో కలిసి నటించానని.. తామిద్దరికీ ఫిట్ నెస్ కామన్ ఇంట్రస్ట్ పాయింట్ కావడంతో తొందరగానే కనెక్ట్ అయ్యామని చెప్పుకొచ్చాడు. అతడితో కలిసి జిమ్ లో వర్కవుట్స్ కూడా చేశానని చెప్పాడు. బన్నీతో కలిసి ఒకసారి పనిచేస్తే అతడు ఎందుకు స్టార్ అయ్యాడో తెలిసిపోతుందని... తను అంతటి హార్డ్ వర్కర్ అని కితాబిచ్చాడు.
తెలుగు అంతగా రాకపోయినా తాను చేయబోయే సీన్లకు అర్ధం తెలుసుకున్నాకే సెట్లోకి అడుగు పెడతానని అనూప్ అంటున్నాడు. రోగ్ సినిమా కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పానని.. నాపేరు సూర్యలో కూడా తన గొంతే వినిపిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో హీరో అండ్ విలన్ మధ్య యాక్షన్ సన్నివేశాలు అమేజింగ్ గా ఉంటాయని.. అవి అందరినీ తప్పకుండా థ్రిల్ చేస్తాయని అంటున్నాడు. ఇద్దరు కండల వీరులు కలబడితే ఆ మాత్రం థ్రిల్లింగ్ గా ఉండకుంటే ఎలా?