భారతీయ సినిమాకి నడక నడత నేర్పిన అత్యుత్తమ గురువుల్లో ఒకరిగా అనుపమ్ ఖేర్ కి గుర్తింపు గౌరవం ఉంది. ఆయన సినిమాల్లో బహుముఖ పాత్రలు పోషిస్తూనే నటవిద్యాలయాలను దేశవ్యాప్తంగా రన్ చేస్తూ ఎందరో శిష్యులను తయారు చేసారు. భారతీయ సినిమాని నిర్మించిన అత్యుత్తమ నటుల్లో ఒకరిగా మన్ననలు అందుకుంటున్నారు.
అతను తన కంటెంట్ తో ప్రయోగాలెన్నో చేశారు. నటుడిగానూ ఉత్తమ ప్రయోగాలతో జాతీయ అవార్డులు అందుకున్నారు. దేశవ్యాప్తంగా షాక్ వేవ్ లను పంపిన కల్ట్ క్లాసిక్ 'కాశ్మీర్ ఫైల్స్'లో కీలక పాత్రను పోషించాడు.
అనుపమ్ ఖేర్ ఇటీవల బ్లాక్ బస్టర్ 'కార్తికేయ 2' లో చిన్న అతిధి పాత్రలో నటించారు. శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని వివరించే అతని చిన్న సన్నివేశం సినిమాలోని అత్యంత ఆసక్తికరమైన సన్నివేశాలలో ఒకటి.
ఇది ప్రేక్షకుల్లో ఉద్విగ్నతను పెంచే పాత్ర. తాజా మీడియా సమావేశంలో...ఈ రోజుల్లో ఎక్కువగా వెలుగులోకి వస్తున్న నార్త్ వర్సెస్ సౌత్ చర్చపై అనుప్ ని తన అభిప్రాయాన్ని అడిగారు.
దానికి అనుపమ్ ఖేర్ స్పందిస్తూ.. సౌత్ సినిమా కథకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంటే.. హిందీ చిత్రనిర్మాతలు దర్శకులు ''ప్రాథమిక కథాంశం'' కంటే స్టార్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని అన్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్న అనుపమ్ ఖేర్ వంటి గొప్ప నటుడి నుండి ఇది చాలా పెద్ద షాకింగ్ స్టేట్ మెంట్. దీనిని హిందీ పరిశ్రమ అర్థం చేసుకుని విశ్లేషించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ఒకప్పుడు సౌత్ సినిమాల్లో కథ ఉండేది కాదని విమర్శలొచ్చాయి. కానీ అనుపమ్ లాంటి గొప్ప గురువు దిశా నిర్ధేశకుడు తెలుగు సినిమాని సౌత్ సినిమాని ఉద్ధేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యతో ఖాన్ ల త్రయం... కపూర్ లు రోషన్ లు కుమార్ లు హీరో ఎలివేషన్లు మాత్రమే కాకుండా మంచి వైవిధ్యమైన కథలపైనా దృష్టి సారిస్తారని కూడా ఆశిద్దాం.. ఆయన సూచన మేరకు!!!