ప్రేమలో ఉన్నా.. నిజమే కానీ..: అనుపమ

Update: 2022-05-30 08:30 GMT
మలయాళం ప్రేమమ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల కాలంలో చేస్తున్న సినిమాలు అలాగే కొన్ని విషయాలపై స్పందిస్తున్న విధానం కూడా చాలా విభిన్నంగా ఉంది. వీలైనంత వరకు గ్లామర్ ప్రపంచానికి చాలా దూరంగా ఉండే ఈ బ్యూటీ రీసెంట్ గా రౌడీ బాయ్స్ సినిమాలో మాత్రం గతంలో ఎప్పుడూ లేనంతగా షాక్ ఇచ్చింది. ఏకంగా లిప్ లాక్ కిస్ ఇవ్వడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశంలో కూడా ఆమె కనిపించిన విధానం అందరిని కూడా ఆశ్చర్యాన్ని కలుగజేసింది.

ఇక అప్పుడప్పుడు అనుపమ పరమేశ్వరన్ లవ్ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ బ్యూటీ ప్రేమలో ఉన్న విషయాన్ని కూడా చాలా వివరంగా తెలియజేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

గతంలోనే ఈ స్టార్ క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్లు గా అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. కాని ఆ క్రికెటర్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అవన్నీ కూడా అబద్ధాలు అని తేలిపోయింది.

కానీ ఇప్పటికి కూడా అనుపమ తన ప్రేమ విషయంలో తెలియని సస్పెన్స్ ను కొనసాగిస్తోంది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని మరొక క్లారిటీ కూడా వచ్చింది.

తనది పూర్తిగా వన్ సైడ్ లవ్ అంటూ అవతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని ఎదురు చూస్తున్నట్లుగా వివరణ ఇస్తుంది. అంతేకాకుండా ఫైనల్ గా తాను మాత్రం ప్రేమ పెళ్లిని ఇష్టపడతాను అని ఇప్పటికే అలాంటి జంటలను చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుంది అని చెబుతోంది.

తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని ఆ విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలుసు అని కూడా ఈ బ్యూటీ ఎలాంటి అనుమానాలు లేకుండా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఫైనల్ గా అనుపమ పరమేశ్వరన్ అయితే ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు గా అర్థం అయిపోయింది. మరి ఆ వ్యక్తి ఇండస్ట్రీకి చెందిన వారా లేక బయటి వ్యక్తుల అనేది తెలియాలంటే అనుపమనే తెలియజేయాలి మతి ఈ బ్యూటీ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.
Tags:    

Similar News