అనుపమ పరమేశ్వరన్. తెలుగుతెరకు పరిచయం అక్కర్లేని పేరు. 'అఆ' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన నటనతో, క్యూట్ లుక్స్ తో లక్షలాది అభిమానుల అభిమానాన్ని చూరగొంటుంది. ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కొద్దికాలంలోనే అనుపమ విపరీతమైన క్రేజ్ తో, వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ వస్తుంది. మొదటి సినిమా నుండి సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటుంది అనుపమ. తెలుగులో దాదాపు యంగ్ హీరోల అందరితో నటించింది. శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది.
ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన 'రాక్షసుడు' సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది అనుపమ. తాజాగా అనుపమ చిన్నప్పుడు శ్రీ కృష్ణుడి గెటప్ లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో చిన్ననాటి అనుపమ క్యూట్ గా ముస్తాబై ఫోటోకి మంచి స్మైల్ తో లుక్కిచ్చింది. ఆ ఫోటో చూసినవాళ్లంతా ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో మిలియన్ల అభిమానులకు ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేసి థ్రిల్ కి గురిచేస్తుంది. చేతిలో ఫ్లూట్ పట్టుకొని నిలుచున్న అనుపమ ఎంతో ముద్దుగా ఉందని ఇంస్టాగ్రామ్ లో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ లాక్ డౌన్ సమయంలో ఇలా ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం నిన్నుకోరి తమిళ రీమేక్ లో నటిస్తున్న అనుపమ తెలుగులో ఇంకా ఏ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లుగా లేదు. అలాగే మలయాళంలో కూడా వరుస ఆఫర్లతో బిజీ అవుతోందట ఈ ముద్దుగుమ్మ.