ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకున్నా సక్సెస్ రేట్ అన్నది 20-30 శాతానికి మించదు. అలాంటి చోట దర్శకుడైనా.. నిర్మాత అయినా.. హీరో హీరోయిన్లయినా వరుసగా హిట్లు కొట్టడం అన్నది కష్టమే మహా అయితే వరుసగా రెండో మూడో హిట్లు కొడతారు. ఐతే మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ మాత్రం వరుసగా ఆరు హిట్లు కొట్టేసి డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసింది. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఆమెకు ఫ్లాప్ అన్నదే లేకపోవడం విశేషం.
మలయాళంలో అనుపమ తొలి సినిమా ‘ప్రేమమ్’ ఎంత పెద్ద హిట్టో.. ఆ సినిమాతో తనకెంత పేరొచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాతో త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ని మెప్పించి.. ‘అఆ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అనుపమ. ఆ సినిమా సూపర్ హిట్టయి తెలుగులోనూ గోల్డెన్ లెగ్ అన్న పేరు తెచ్చిపెట్టింది. వెంటనే తెలుగు ‘ప్రేమమ్’తోనూ సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. అనుపమ. తాజాగా సంక్రాంతికి ‘శతమానం భవతి’తో టాలీవుడ్లో హ్యాట్రిక్ పూర్తి చేసింది. దీని కంటే ముందు తమిళంలో ఆమె చేసిన తొలి సినిమా ‘కొడి’ కూడా హిట్టే.
‘శతమానం భవతి’ తర్వాత ఐదు రోజుల్లోనే ఇంకో హిట్టుతో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసింది అనుపమ. మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు జోడీగా అనుపమ ‘జామాంట్ సువిశేషంగల్’ కూడా హిట్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇలా అరంగేట్రం నుంచి వరుసగా ఆరు హిట్లు కొట్టడం అరుదైన విషయమే.