అంతా లైకులే.. కానీ నో లవ్ స్టొరీ అంటున్నారు!

Update: 2019-06-11 12:48 GMT
టీమ్ ఇండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాకు  సౌత్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు మధ్య ప్రేమాయణం సాగుతోందని ఒక వారం రోజులగా సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది.  సోషల్ మీడియా ఏం ఖర్మ.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ అనుపమ-బుమ్రా లవ్ పై కథనాలు వచ్చాయి. అయితే అసలు ఈ గుసగుసలకు కారణం ఏంటి? సౌత్ లో ఉండే ఈ బ్యూటీకి నార్త్ లో ఉండే ఆ బౌలర్ కు లంకె ఎక్కడ కుదిరింది?

ఇద్దరు ప్రేమలో పడాలంటే ఎక్కడో ఒక చోట కలవాలి కదా? కానీ ఈ ఇద్దరూ ఎక్కడా కలిసిన దాఖలాలు లేవు.  కలిసి ఏదైనా ఈవెంట్ లో ఫోటోలకు పోజిచ్చిన సందర్భాలు లేవు. మరి ఎక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందో మనకు తెలియదు. కానీ వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుదనేవారు చూపించే ఋజువులు ఏంటంటే సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారు. బుమ్రా తన ట్విట్టర్ ఖాతాలో మొత్తం ఇరవై ఐదు మందినే ఫాలో అవుతున్నాడు. ఆ లిస్టులో ఒక్క ఫిలిం సెలబ్రిటీ కూడా లేరు.. అనుపమ పరమేశ్వరన్ తప్ప. ఇక అనుపమ ఏదైనా పోస్ట్ పెడితే వెంటనే 'లైక్' కొడుతున్నాడట.  ఇక మన అనుపమ కూడా తక్కువేమీ తినలేదట.  బుమ్రాను ఫాలో చేయడమే కాదు.. ఆ పొడగరి పెట్టే పోస్టులకు ఈ సొగసరి తన లైకులతో జేజేలు తెలుపుతోందట.  ఈ లైకుల స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అసలే వరల్డ్ కప్ సీజన్ కావడంతో క్రికెటర్ల మీద డబల్ ఫోకస్ ఉంటుంది.  అందుకే బుమ్రా లైకులు ఇప్పుడు హాట్ టాపిక్.

ఈ విషయంపై బుమ్రా ఇంకా స్పందించలేదు కానీ అనుపమను ప్రశ్నిస్తే బుమ్రా తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని క్లారిటీ ఇచ్చిందట.  అంతా బాగానే ఉంది కానీ వీరిద్దరి మధ్యలో లవ్ సంగతి పక్కన పెడితే..  ఫ్రెండ్షిప్ డెవలప్ కావాలన్నా కనీసం ఒక్కసారైనా కలిసి కప్పు కాఫీ అయినా తాగి ఉండాలి.  లేదా ఏ పిజ్జానో.. బర్గరో కలిసి తింటూ కబుర్లు చెప్పుకొని ఉండాలి.  ఏవీ లేవు.  ఇదేదో మిస్టరీ ఫ్రెండ్షిప్ లా.. థ్రిల్లర్ లవ్ స్టొరీలా అనిపిస్తోంది.  కొంపదీసి.. సోషల్ మీడియా ద్వారా.. వీడియో చాటింగుల ద్వారా పరిచయం చేసుకొని ఫ్రెండ్స్ అయ్యి.. ఆ తర్వాత లవ్ చేసుకొని.. ఆ టైపా ఏంటి?  ఎక్కువ ఆలోచిస్తే బుర్ర హీటేక్కేలా ఉంది.  ఇదిలా ఉంటే ఈ బుమ్రాకు ఇలాంటి రూమర్లు కొత్త కాదు. గతంలో రాశి ఖన్నాను విచ్చలవిడిగా ప్రేమిస్తున్నాడని గాసిప్పులు గుప్పుమన్నాయి. కానీ రాశి గట్టిగా ఖండించడంతో ఆ వార్తలు మరుగున పడ్డాయి. ఇప్పుడు అనుపమ వంతు.  నెక్స్ట్ ఎవరో మరి?


Tags:    

Similar News