బేబీ బంప్ తో ప్రేమమ్‌ బ్యూటీ.. కంగ్రాట్స్ చెప్పిన సెలబ్రెటీలు

Update: 2022-01-31 16:30 GMT
మలయాళ ప్రేమమ్‌ సినిమాతో హీరోయిన్ గా సౌత్ సినీ అభిమానులకు సుపరిచితురాలుగా మారిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. తెలుగు లో ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే లక్ కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కలేదు. కానీ నటిగా మంచి పేరు మాత్రం వచ్చింది. హీరోయిన్ గా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తూ మెప్పిస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. తనకు నచ్చితే షార్ట్‌ ఫిల్మ్ మరియు వెబ్‌ సిరీస్ లో కూడా నటించేందుకు సిద్దపడే ఈ అమ్మడు తాజాగా సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

ఈ ప్రేమమ్‌ బ్యూటీ సోషల్‌ మీడియాలో బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. నిన్న మొన్నటి వరకు నార్మల్‌ గానే ఉన్నావు... పెళ్లి కూడా ఇంకా కాలేదు ఎలా ఈ బేబీ బంప్‌ అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఈ అమ్మడికి సరదాగా కంగ్రాట్స్ ను కామెంట్ చేస్తున్నారు. విద్యు రామన్‌.. బేబీ నేను కంగ్రాట్స్ అంటూ టైప్ చేశాను అంటూ సరదాగా కామెంట్‌ చేసింది. ఇంకా చాలా మంది ఈ అమ్మడికి కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెట్టడంతో పాటు రకరకాలుగా ట్రోల్స్ చేయడం తో పాటు మీమ్స్ ను కూడా షేర్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో తన గురించి మీమ్స్ ను కోరుకోవడంతో పాటు ట్రోల్స్ ను ఎంజాయ్‌ చేసే అనుపమ ఇలాంటి వాటి కోసమే ఈ పాత ఫొటోలను షేర్‌ చేసింది.

రెండేళ్ల క్రితం ఈమె నటించిన ఒక మలయాళ సినిమాలోని ఫొటో ఇది. థ్రూ బ్యాక్ ఫొటో అంటూ అనుపమ ఈ ఫొటోలను సరదాగా షేర్‌ చేసింది. ఆమె కోరుకున్నట్లుగానే నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఎప్పడు స్కిన్‌ షో చేస్తూ.. ట్రెడీషనల్‌ లుక్ లో హాట్‌ లుక్ లో కనిపించడం కంటే అప్పుడప్పుడు ఇలా విభిన్నమైన ఫొటోల్లో మరియు వీడియోల్లో కనిపించడం ద్వారా ఈ అమ్మడికి సోషల్‌ మీడియా ద్వారా మరింత పాపులారిటీ దక్కుతుంది. పది మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు బేబీ బంప్‌ తో కనిపించిన వెంటనే దాదాపుగా 8 లక్షల మంది లైక్స్ కొట్టారు.. లక్షల మంది కామెంట్స్ ద్వారా వారి అభిప్రాయంను తెలియజేశారు.
Tags:    

Similar News