బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే నా సోదరుడు అనుపమ్ శ్యామ్ బతికేవాడు! అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు సోదరుడు అనురాగ్. లగాన్ -మంగళ్ పాండే: ది రైజింగ్ వంటి చిత్రాలలో అమీర్ ఖాన్ తో పనిచేసిన క్యారెక్టర్ నటుడు అనుపమ్ శ్యామ్ ఇటీవల అవయవ వైఫల్యం(మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్) తో మరణించారు. తన సోదరుడు అనురాగ్ ని బతికించేందుకు అమీర్ తమకు డబ్బు అప్పుగా ఇస్తానని మాటిచ్చాడని కానీ తరువాత ఫోన్ కాల్ తీయడం మానేశారని ఆరోపించాడు.
తాజా ఇంటర్వ్యూలో అనుపమ్ శ్యామ్ సోదరుడు అమీర్ ఖాన్ ను మెటీరియలిస్టిక్ అంటూ విమర్శించారు. అమీర్ తన వాగ్దానాన్ని గౌరవించినట్లయితే అనుపమ్ ఇంకా జీవించి ఉండేవాడని చెప్పాడు.
అతను ఒక ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. “పెద్ద బ్రాండ్ లుగా పరిగణించబడే ఈ పెద్దమనుషులు.. తమ ప్రజలకు ఎందుకు సహాయం చేయలేరు? క్యా లేకర్ అయే ది, .. క్యా లేకర్ జాయేంగే (మీరు చనిపోయినప్పుడు భౌతిక సంపదను మీతో తీసుకెళ్లలేరు). పరిశ్రమ వెలుపల ప్రభుత్వాన్ని సాయం కోసం వేడుకుంటున్న మన ప్రజలకు మనం ఎందుకు సహాయం చేయలేము? చాలా మంది నటులు, కొరియోగ్రాఫర్లు ఇతర టెక్నీషియన్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మా పెద్దలు గట్టిగా పిడికిలి బిగించి కూర్చున్నారు`` అంటూ ఎద్దేవా చేసారు.
మెసేజ్ లకు అమీర్ ఖాన్ రిప్లై ఇవ్వడం మానేయడంతో తన సోదరుడు హర్ట్ అయ్యాడని అనురాగ్ చెప్పాడు. “ఉంకి సోచ్ ఉంకో ముబారక్ మరియు ఆద్మీ కో ఇట్నా మెటీరియలిస్టిక్ నహీ హోనా చాహియే (అతను తన అభిప్రాయానికి అర్హుడు.. కానీ నేను అలాంటి భౌతికవాదిగా ఉండకూడదని నేను భావిస్తున్నాను). అమీర్ ఖాన్ నా సోదరుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఉంటే అనుపమ్ ఈరోజు జీవించి ఉండేవాడు. ఉంకే అప్నో నే ఉంక సాథ్ నహిన్ దియా (తాను విశ్వసించిన వారు అతనికి సహాయం చేయలేదు).. అంటూ ఆవేదన చెందాడు.
నటుడు అనుపమ్ శ్యామ్ గత కొన్ని సంవత్సరాలుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. మరణానికి కొన్ని రోజుల ముందు ఆసుపత్రిలో ఉన్నారు. అతను విలన్ పాత్రలను పోషించడంలో బాగా పాపులరయ్యాడు. `మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ 2` అనే టీవీ షో అతడికి ఇంటి పేరుగా మారింది. అయితే అమీర్ ఖాన్ పై అతడు అక్కసు వెల్లగక్కినా.. ఇటీవల కరోనా క్రైసిస్ కష్ఠకాలంలో అతడు తన వంతు సాయాన్ని ఎలాంటి ప్రచారం కోరుకోకుండా సైలెంట్ గా చేయడాన్ని కూడా చూడాలంటున్నారు ఒక సెక్షన్ అభిమానులు.