బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్ కశ్యప్ చాలా అసభ్యంగా ప్రవర్తించాడని.. తనని బలవంతం చేయబోయాడని పాయల్ ఘోష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ఆమె వాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ విషయంలో అనురాగ్ కశ్యప్ కు సినీ ఇండస్ట్రీ నుండి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తాప్సీ పొన్ను - రాధికా ఆప్టే - రామ్ గోపాల్ వర్మ - అనుభవ్ సిన్హా - సుర్వీన్ చావ్లా - టిస్కా చోప్రా - సాయాని గుప్తా వంటి సెలబ్రిటీలు అనురాగ్ కి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో అనురాగ్ మాజీ భార్య అయిన హీరోయిన్ కల్కి కోచ్లిన్ నుంచి కూడా ఆయనకు మద్దతు రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ లో కల్కి సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.
"డియర్ అనురాగ్.. సోషల్ మీడియాలో మీపై వస్తున్న ఆరోపణలను పట్టించుకోకండి. మీ స్కిప్ట్ ద్వారా మహిళల స్వేచ్చ కోరే వ్యక్తి మీరు. వ్యక్తిగతంగా కూడా ఇండస్ట్రీలో మహిళల సమగ్రతను సమర్థిస్తారు. వ్యక్తిగతంగా మీరు మహిళలను ఎంత సమర్ధిస్తారనే దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. మహిళల స్వేచ్చను కోరే వ్యక్తి మీరు. వ్యక్తిగతంగా వృత్తిపరంగా నన్ను ఎప్పుడూ మీతో సమానంగా చూశారు. మన విడాకుల తర్వాత కూడా చిత్తశుద్ధితో నిలబడ్డారు. నేను నా వర్క్ ప్లేస్ లో అసౌకర్యానికి అసురక్షితకు లోనైనప్పుడు నాకెంతో సపోర్ట్ గా నిలిచారు. నిజానిజాలు తెలుసుకోకుండా విమర్శలు తప్పుడు వాదనలు చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది మన ఫ్రెండ్స్ ని, బంధువులను, కుటుంబాలను నాశనం చేస్తుంది. అవరసరమైన సమయంలో ప్రేమను పంచే వ్యక్తులే కాకుండా చుట్టూ ఎవరూ లేనప్పుడు దయ చూపే వ్యక్తులు కూడా ఉంటారు. అది మీకు కూడా తెలుసు. మీరు అలాంటి గౌరవానికి కట్టుబడి ధైర్యంగా ఉండండి. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి" అని తెలిపారు కల్కి కొచ్లిన్.
కాగా, అనురాగ్ కశ్యప్ మొదటి భార్య ఆర్తి బజాజ్ కూడా ఇప్పటికే ఆయనకు మద్దతు తెలుపుతూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్తి బజాజ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ''అనురాగ్ నువ్వు రాక్ స్టార్. మీరు ఇప్పటివరకు ఎలా మహిళలకు సురక్షితమైన ప్రదేశం సృష్టించి శక్తివంతం చేసారో అలానే చేస్తూ ఉండండి. ఇది ఇప్పటివరకు నేను చూసిన చౌకైన స్టంట్. మొదట ఇది నాకు కోపం తెప్పించింది. కానీ ఇప్పుడు ఇది నాకు గట్టిగా నవ్వు తెప్పిస్తోంది. మీరు మరింత గట్టిగా మీ గొంతును వినిపించండి. మేము నిన్ను ప్రేమిస్తున్నాము'' అని పోస్ట్ చేసింది. అయితే ఇప్పటివరకు అనురాగ్ కు బాలీవుడ్ ప్రముఖల నుండి మద్దతు వస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అనురాగ్ నుండి విడాకుల తీసుకున్న ఇద్దరు మహిళ.. అతనికి సపోర్ట్ గా నిలవడం అతని క్యారక్టర్ ని తెలియజేస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Full View